పాపులర్ కమెడియన్ మధునందన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘గుండె కథ వింటారా’. వంశీధర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని ట్రినిటి పిక్చర్స్ పతాకంపై క్రాంతి మంగళంపల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మధునందన్ సరసన స్వాతిస్ట కృష్ణన్, శ్రేయ నవిలే హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుండి `ఎంత బావుందో…` లిరికల్ సాంగ్‌ని విజయ్‌దేవరకొండ రిలీజ్‌చేసి చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ తెలిపారు. `ఎంత బావుందో..పక్కనే ఉన్నా మనసులో మాట చెప్పలేకున్నా…గుప్పెడుగుండె తట్టింది ఎవరో నాకు చెప్పింది..పైకే చెప్పనంటోంది హాయో మాయో అంతా కొత్తగా ఉంది ఐనా ఇదే బాగుంది బహుశా ఎదురుపడనంది` అంటూ సాగే ఈ సోల్ ఫుల్ మెలొడీకి మసాలా కాఫీ సంగీతం సమకూర్చగా కృష్ణ చైతన్య సాహిత్యం అందించారు. కృష్ట జెకే, వరుణ్ సునీల్ ఆహ్లాదంగా ఆలపించారు.
Related posts
-
వర్మ చేతుల మీదుగా ‘ఫైట్ మహా’ టీజర్ విడుదల
Spread the love సునీల్, అఖిల్ ఉడ్డెమారి, డా. శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా... -
మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు.. మేమంతా కలిసే ఉంటాం : జానీ మాస్టర్
Spread the love సర్వసభ్య సమావేశంలో వచ్చిన మెజార్టీ అభిప్రాయంతోనే ముందుకు వెళ్తున్నాం. ఏక పక్ష నిర్ణయం ఎక్కడా తీసుకోలేదు – టీఎఫ్‌టీడీడీఏ... -
‘శ్రీనివాస మంగాపురం’యాక్షన్ థియేట్రికల్ ట్రైలర్
Spread the love శ్రీనుకు మంగా అంటే ప్రాణం. మొదట అతని ప్రేమను అంగీకరించని మంగా, అతని నిజమైన ప్రేమను చూసి చివరకు...
