మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా , సాయి మంజ్రేకర్ హరోయిన్ గా కిరణ్ కొర్రపాటి ని దర్శకుడుగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా గని. ఈ చిత్రాన్ని అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు లెజెండరి ప్రోడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించి విడుదలైన టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే రీసెంట్ గా విడుదలయ్యిన స్టార్ హీరోయిన్ తమన్నా సాంగ్ కి మాత్రం సోషల్ మీడియాలో చాలామంచి రెస్పాన్స్ రావటం విశేషం. ఈ పాటకి వచ్చిన రెస్పాన్స్ కి హీరోయిన్ తమన్నా కూడా మరింత వుత్సాహంతో ఈ సాంగ్ మీద రీల్స్ చేయటం ఫ్యాన్స్ కి మరింత వూపిచ్చింది. యూ ట్యూబ్‌లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తున్న ‘కొడితే’ సాంగ్ కి ఇప్పుడు స్పెషల్ క్రేజ్ రావటం అందరూ ఈ సాంగ్ మీద రీల్స్ చేయటం గని సినిమా క్రేజ్ ని మరోక్కసారి ప్రూవ్ చేసింది. ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి గారు ఈ పాట రాసారు. హారిక నారాయణ్ పాడిన ఈ పాట పాడింది. తమన్నా అందచందాలు పాటకు అదనపు ఆకర్షణ నిలిచాయి. అంతేకాదు సినిమాలో వరుణ్ తేజ్ సిక్స్ ప్యాక్ తో బాక్సింగ్ రింగ్ లో రియలిస్టిక్ పెర్‌ఫార్మెన్స్ తో అలరించనున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర, నదియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి అతిత్వరలో ఈ సినిమా డేట్ ని లాక్ చేసుకుంటున్నారు నిర్మాతలు.
నటీనటులు: వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర, నదియా తదితరులు
టెక్నికల్ టీమ్: దర్శకుడు: కిరణ్ కొర్రపాటి, నిర్మాతలు: అల్లు బాబీ, సిద్దు ముద్ద, సమర్పకుడు: అల్లు అరవింద్
ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్ , సినిమాటోగ్రపీ: జార్జ్ సి విలియమ్స్, ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్, సంగీతం: థమన్
పిఆర్ఓ: వంశీ కాక, ఏలూరు శ్రీను.