వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఇక పాన్ ఇండియా స్టార్!!

VaralakshmiSarathkumarwillbeseenintheleadr
VaralakshmiSarathkumarwillbeseenintheleadr
Spread the love

నెగటివ్, పాజిటివ్‌ క్యారెక్టర్లతో దూసుకెళుతున్న వరలక్ష్మీ శరత్‌కుమార్‌ తాజాగా ‘మైఖెల్‌’ సినిమాలో ఓ కీలక పాత్రకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. విలన్‌ గ్యాంగ్‌లో రౌడీ లేడీ, న్యాయం చేయడానికి కృషి చేసే లాయర్‌ లాంటి పాత్రలతో యమబిజీగా దూసుకెళుతోంది. సందీప్‌ కిషన్, దివ్యాంశా కౌశిక్‌ జంటగా రంజిత్‌ జయకోడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మైఖెల్‌’. నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్‌ సమర్పణలో భరత్‌ చౌదరి, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్నారు. విజయ్‌ సేతుపతి, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ‘‘యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. సందీప్‌ కిషన్‌ పాత్ర ఇంటెన్సిటీతో ఉంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో గౌతమ్‌ మీనన్‌ విలన్‌గా నటిస్తున్నారు. త్వరలో రెండో షెడ్యూల్‌ ప్రారంభిస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. కోలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరో శరత్ కుమార్ వారసురాలిగా .. కథానాయికగా వరలక్ష్మి శరత్ కుమార్ అడుగుపెట్టింది. అయితే కథానాయికగా ఆమెకి ఆశించిన స్థాయి ఆదరణ లభించలేదు. దాంతో వెంటనే ఆమె విలన్ రోల్స్ వైపు దృష్టిపెట్టింది. నెగెటివ్ షేడ్స్ కలిగిన ఆ పాత్రలు ఆమెకి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’ సినిమా ద్వారా తెలుగులో కూడా ఆమె విలన్ గానే ఎంట్రీ ఇచ్చింది. ఇక రవితేజ ‘క్రాక్’ సినిమాతో ఆమె విలనిజం ఇక్కడి ప్రేక్షకులకు మరింతగా నచ్చేసింది. దాంతో ఆమె తెలుగులోనూ బిజీ అవుతోంది. బాలకృష్ణ – గోపీచంద్ మలినేని సినిమాలో ఆమె విలన్ గా కనిపించనుంది. ఇక సమంత ‘యశోద’ సినిమాలోను ఒక కీలకమైన పాత్రను చేస్తోంది.అయితే.. ‘మైఖేల్’ సినిమాలోను ఆమె విలన్ రోల్ కి సమానమైన రోల్ చేస్తోందట. గౌతమ్ మీనన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో, సందీప్ కిషన్ .. విజయ్ సేతుపతి ప్రధానమైన పాత్రలను చేస్తున్నారు. రంజిత్ జయ కోడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, ‘మజిలీ’ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్ కథానాయికగా అలరించనుంది. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాతో వరలక్ష్మి పాన్ ఇండియా స్టార్ అవుతోందన్న మాట!