మాస్ మ‌హారాజ రవితేజ‌ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri’s Ramarao On Duty First Look is Out
mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri’s Ramarao On Duty First Look is Out
Spread the love

మాస్ మ‌హారాజ ర‌వితేజ కెరీర్‌లో 68వ మూవీగా శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వంలో సుధాక‌ర్ చెరుకూరి నిర్మాత‌గా SLV సినిమాస్, ఆర్ టి టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై రూపొందుతున్న చిత్రానికి రామారావు ఆన్ డ్యూటీ అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌ను క‌న్ఫ‌ర్మ్ చేశారు. ఈ రోజు ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌.
రామారావు ఆన్ డ్యూటీ చిత్రానికి నూత‌న దర్శ‌కుడు దర్శకత్వం వహించినప్పటికీ, దీనికి సంబంధించిన ప్రతి అనౌన్స్‌మెంట్ ఈ మూవీపై క్యూరియాసిటీని పెంచింది. ఇప్ప‌టివ‌ర‌కూ విడుద‌ల‌చేసిన రెండు పొస్ట‌ర్స్‌లోనూ ర‌వితేజ ముఖం క‌నిపించ‌న‌ప్ప‌టికీ ఆ పోస్ట‌ర్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ర‌వితేజ హాఫ్ స్లీవ్ షర్ట్, ఫార్మల్ ప్యాంటు వేసుకుని ట్రెండీ గాగుల్స్‌తో సూప‌ర్‌స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు. ఈ పోస్ట‌ర్ చూస్తుంటే నిజాయితీ మరియు దూకుడుగా ఉన్న ప్రభుత్వ అధికారిగా ర‌వితేజ నటించార‌ని తెలుస్తోంది.
అంతే కాకుండా ఈ పోస్టర్‌లో బి. రామారావుగా ప్రమాణ స్వీకారపు లేఖ కూడా ఉంది. ఆయనకు కేటాయించిన ప్రభుత్వ వాహనాన్ని బ్యాక్‌గ్రౌండ్ లో చూడవచ్చు. టైటిల్ పోస్టర్ కూడా అద్భుతంగా రూపొందించబడింది.
మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే రామారావు ఆన్ డ్యూటీ రియ‌ల్ ఇన్స్‌టెండ్స్ ఆధారంగా ఒక యూనిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోంది.
ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ర‌వితేజ‌, హీరోయిన్లలో ఒకరిగా నటిస్తోన్న‌
దివ్యాంశ కౌశిక్ మ‌రియు ఇత‌ర తారాగ‌ణంపై కొన్ని కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు.
ఈ చిత్రానికి స్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండ‌గా స‌త్య‌న్ సూర్య‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. కేఎల్ ప్ర‌వీణ్ ఎడిట‌ర్‌.
తారాగ‌ణంః
ర‌వితేజ‌, దివ్యాంశ కౌశిక్, నాజ‌ర్‌, సీనియ‌ర్ న‌రేష్‌, ప‌విత్ర లోకేష్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, ఈ రోజుల్లో శ్రీ‌, మ‌ధుసూధ‌న్ రావు, సురేఖ వాణి
సాంకేతిక వ‌ర్గం:
క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: శ‌ర‌త్ మండ‌వ‌
నిర్మాత‌: సుధాక‌ర్ చెరుకూరి
బ్యాన‌ర్‌: ఎస్ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్‌పి, ఆర్‌టి టీమ్ వ‌ర్క్స్‌
సంగీతం: స్యామ్ సీఎస్‌
సినిమాటోగ్ర‌ఫి: స‌త్య‌న్ సూర్య‌న్
ఎడిట‌ర్‌: కేఎల్ ప్ర‌వీణ్‌
ఆర్ట్: సాయి సురేష్‌
పిఆర్ఓ: వంశీ- శేఖ‌ర్