బర్త్ అఫ్ ‘భువన విజయమ్’ విడుదల

బర్త్ అఫ్ ‘భువన విజయమ్’ విడుదల
బర్త్ అఫ్ ‘భువన విజయమ్’ విడుదల
Spread the love

సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు యలమంద చరణ్ దర్శకత్వంలో హిమాలయ స్టూడియో మాన్షన్స్ , మిర్త్ మీడియా బ్యానర్స్ పై కిరణ్, విఎస్కే నిర్మిస్తున్న చిత్రం ‘భువన విజయమ్’.

వేసవిలో విడుదలకు సిద్దమౌతున్న ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది ఇప్పటికే టీజర్, థీమ్ సాంగ్ ఆకట్టుకున్నాయి. తాజాగా బర్త్ అఫ్ ‘భువన విజయమ్’ వీడియోని విడుదల చేశారు.

రెగ్యులర్ గా కాకుండా ఓ కొత్త కథ కోసం ఎదురుచూస్తుంటాడు సునీల్. కొంత మంది రచయితలు కొన్ని కథలువినిపిస్తారు. అవన్నీ రెగ్యులర్ గా అనిపిస్తాయి. ఇలా రెగ్యులర్ కు మించి ఒక కథ కావాలన్నప్పుడు.. ‘భువనవిజయమ్; టైటిల్ పడటం ఆసక్తికరంగా వుంది. ఈ సినిమా రెగ్యులర్ కి భిన్నంగా వుంటుందని ఈ వీడియో చెప్పకనే చెపింది

శ్రీమతి లక్ష్మీ సమరిస్తున్న ఈ చిత్రంలో గోపరాజు రమణ, రాజ్ తిరందాసు, జబర్దస్త్ రాఘవ, అనంత్ , సోనియా చౌదరి, స్నేహల్ కామత్, షేకింగ్ శేషు, సత్తి పండు ఇతర తారాగణం.

శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సాయి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్. వేసవిలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.