తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి నియామకం కేసీఆర్‌కు దడ పుట్టిస్తోంది

Spread the love

శుభాకాంక్షలు అందజేసిన ఆలేరు యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జూకంటి సంపత్

టాలీవుడ్ టైమ్స్ న్యూస్

తెలంగాణ పిసిసి నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు అనుముల రేవంత్ రెడ్డిని ఆలేరు యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జూకంటి సంపత్ హైదరాబాద్ కు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా జూకంటి సంపత్ అక్కడికి వచ్చిన హైదరాబాద్ మీడియాతో మాట్లాడుతూ- కేసీఆర్‌కు దుర్బుద్ధి పుట్టి ప్రభుత్వాన్నీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే అప్పుడు ప్రజలకు మేలు జరుగుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యానించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. గతంలో అనేకసార్లు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ ఇప్పుడు ప్రజల కోసం మరోసారి ఎందుకు వెళ్లకూడదన్నారు. కేసీఆర్ పోవాలంటే ఎన్నికలు రావాలన్నారు. భస్మాసుర హస్తం కేసీఆర్ చేతుల్లోనే ఉంది కాబట్టి ప్రజలకు మేలు జరగాలంటే .. దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ప్రభుత్వాన్నీ రద్దు చేసుకోమని చెప్పాలన్నారు. ప్రజల కష్టాలను చూసి తెలంగాణను సోనియాగాంధీ ఇచ్చారన్నారు. కానీ మరోరకమైన లబ్ధి జరిగి కేసీఆర్ కుటుంబంతో పాటు ఇతర రావులకు మేలు జరుగుతోందన్న అభిప్రాయాన్ని జూకంటి సంపత్ వెలిబుచ్చారు. తెలంగాణ పిసిసి నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు అనుముల రేవంత్ రెడ్డిని చూసి కేసీఆర్‌కు దడ పుడుతుందని, ఇకపై కాంగ్రెస్ రేసులో ముందు ఉండడం ఖాయమని ఆయన అన్నారు.

Related posts

Leave a Comment