ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి గుర్తింపు తెచ్చుకున్నారు నటి రకుల్ ప్రీత్ సింగ్. తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవకాశాలు కోల్పోయానని చెప్పిన రకుల్.. గతంలో ప్రభాస్ సినిమా నుంచి తనను తొలగించడం గురించి మరోసారి మాట్లాడారు. ఓ ఆంగ్ల విూడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ సినిమాలో తన స్థానంలో కాజల్‌ను తీసుకున్నట్లు వెల్లడించారు. ”ప్రభాస్ సరసన ఓ సినిమాలో నాకు అవకాశం వచ్చింది. ఒక షెడ్యూల్‌ను కూడా చిత్రీకరించారు. అప్పుడు నేను దిల్లీలో చదువుకుంటున్నా. దీంతో షెడ్యూల్ పూర్తి కాగానే తిరిగి దిల్లీ వెళ్లిపోయా. అక్కడికి వెళ్లాక రెండో షెడ్యూల్ కోసం ఎన్ని రోజులైనా ఫోన్ రాలేదు. నా స్థానంలో కాజల్‌ను తీసుకున్నట్లు తర్వాత తెలిసింది. నాకు కనీస సమాచారం ఇవ్వకుండా ఆ సినిమా నుంచి తొలగించేశారు. అప్పటికే ప్రభాస్- కాజల్‌ల కాంబినేషన్‌లో…