కెన్యాలో ప్రిపరేషన్‌ వర్క్‌లో రాజమౌళి

Rajamouli in preparation work in Kenya

ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం కెన్యాలో ఉన్నారు. ఇందులోభాగంగా అంబోసెలి నేషనల్‌ పార్క్‌లో తీసిన ఓ ఫొటోని షేర్‌ చేసిన ఆయన తాజాగా ఇన్‌స్టా వేదికగా మరో పోస్ట్‌ పెట్టారు. అడవికి రారాజుగా పిలిచే సింహం ఫొటోని షేర్‌ చేశారు. ’క్రిస్‌ ఫాలోస్‌ తీసిన సెరెంగేటి (టాంజానియాలోని ఒక ప్రాంతం) రాజు ఫొటో ఇది. ప్రస్తుతం ఇది నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. తన తదుపరి సినిమా లొకేషన్స్‌ సెర్చ్‌లో భాగంగానే జక్కన్న అక్కడికి వెళ్లారని పలువురు భావిస్తున్నారు. దీంతో ఎంబి 29పై సినీప్రియుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ’బాక్సాఫీస్‌ రికార్డులు తిరగరాయడం పక్కా’, ’షూటింగ్‌ అప్‌డేట్‌లు కూడా ఇవ్వగలరు’, ’మేము కూడా విూతోనే వచ్చేస్తాం సర్‌’ అని కామెంట్స్‌ పెడుతున్నారు. ఇక మూవీ విషయానికి వస్తే.. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. విజయేందప్రసాద్‌ కథ అందించారు.…

Rajamouli in preparation work in Kenya

Rajamouli in preparation work in Kenya

Veteran director Rajamouli is currently in Kenya. As part of this, he shared a photo taken in Amboseli National Park and recently put another post on Instagram. He shared a photo of a lion known as the king of the jungle. ‘This is a photograph of the King of the Serengeti (a region in Tanzania) taken by Chris Fallows. Now it is attracting the attention of netizens. Many believe that Jakkanna went there as a part of the location search for his next film. With this, the expectations of cinephiles…