తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కు 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన నిర్మాత ఎస్ కేఎన్

Producer SKN announced a donation of 10 lakh rupees to the Telugu Film Directors Association

తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఈ రోజు జరిగాయి. గుడుంబా శంకర్ దర్శకులు వీర శంకర్ నేతృత్వంలోని ప్యానల్ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఈ ప్యానల్ లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన వీరశంకర్ తో పాటు ఉపాధ్యక్షులుగా సక్సెస్ ఫుల్ యంగ్ డైరెక్టర్స్ సాయి రాజేష్ , వశిష్ట భారీ మెజారిటీతో గెలుపొందారు. బేబి చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న యువ నిర్మాత ఎస్ కేఎన్ ఈ విజయోత్సవ సభలో తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యుల గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం కోసం తనవంతుగా 10 లక్షల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు. తన స్నేహితులైన దర్శకులు సాయి రాజేశ్, వశిష్టకు మద్ధతుగా ఎస్ కేఎన్ ఈ విరాళాన్ని అందించారు. ముఖ్యంగా తన స్నేహితుడు సాయి రాజేశ్ తెలుగు ఫిలిం…