టిక్కెట్ల రేట్లపై ఏపీ ప్రభుత్వం తీసుకుని వచ్చిన జీవో 35ను రద్దు చేయాలంటూ ఫేక్ లెటర్లు పెట్టిన వారిపై, వెంటనే విచారణ చేపట్టి, తగిన చర్యలు తీసుకోవాలని సీనియర్ నిర్మాత, దర్శకుడు, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ నట్టికుమార్ విజ్ఞప్తి చేశారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, ‘ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ల రేట్లకు సంబంధించి తెచ్చిన జీవో 35ను రద్దు చేయించాలని పూసర్ల బాబు బాబ్జీ అనే వ్యక్తి ఇటీవల ఏపీ హైకోర్టుకెక్కారు. ఏపీలోని దాదాపు 224 మంది ఎగ్జిబిటర్స్ జీవో 35కు వ్యతిరేకంగా ఉన్నారంటూ, ఫేక్ లెటర్స్ సృష్టించి జీవో 35 రద్దు విషయంలో బాబ్జీ కీలక పాత్ర పోషించారు. నా అంగీకారం లేకుండా నా థియేటర్ పైన కూడా ఫేక్ లెటర్లు సృష్టించి, నా థియేటర్…