అక్కడొకడుంటాడు ఫేమ్ శివ కంఠమనేని హీరోగా భద్రాద్రి, కత్తి చిత్రాల దర్శకుడు మల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం మధురపూడి గ్రామం అనే నేను. క్యాథలిన్ గౌడ హీరోయిన్‌గా నటించింది. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించాడు. ముప్పా వెంకయ్య చౌదరి సారథ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్. వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం. కథలోకి.. మధురపూడి గ్రామంలోనే ఈ కథ అంతా సాగుతుంది. ఆ ఊరే తన ఆత్మకథ చెప్పుకున్నట్టుగా ఆ కోణంలోనే కథ జరుగుతుంది. ఊర్లో సూరి (శివ కంఠమనేని) ఓ మొరటోడు, మొండోడు. సూరి తన స్నేహితుడు బాబ్జీ కోసం ఎంత…