ప్రజెంట్ హారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది…మంచి కథాబలంతో తెరకెక్కిన హారర్, థ్రిల్లర్ చిత్రాలకు థియేటర్స్‌లోనే కాకుండా ఓటీటీల్లోనూ మంచి డిమాండ్ ఉంది. ఆ కోవలోనే ఉత్కంఠభరితమైన కథ, కథనంతో తెరకెక్కుతోన్న హారర్ థ్రిల్లర్ అమరావతికి ఆహ్వానం. శివ కంఠంనేని, ఎస్తర్, ధన్య బాలకృష్ణ, సుప్రిత, హరీష్ ప్రధాన పాత్రలతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో సీనియర్ నటులు అశోక్ కుమార్, భద్రమ్, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ కీలకపాత్రలు పోషించారు. టాలెంటెడ్ డైరెక్టర్ జివికె ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేనర్‌పై కేఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ తాజాగా మధ్య ప్రదేశ్…