HanuMan Movie Review in Telugu: ఆకట్టుకునే ‘హనుమాన్’

HanuMan Movie Review in Telugu:

‘హనుమాన్’ పేరు వింటేనే మనలో ఏదో అలజడి.. ఏదో ధైర్యం.. గత కొన్ని రోజులుగా సినీ ప్రేక్షకులతో పాటు, సోషల్ మీడియాని ఉక్కిరి బిక్కిరి చేస్తోన్న సినిమాఇది. ఈ సినిమా పేరు ప్రేక్షకులను ఒక ఊపు ఊపేస్తున్నదని చెప్పొచ్చు. వర్సటైల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన తొలి భారతీయ సూపర్ హీరో మూవీగా ‘హనుమాన్’ నేడు (12 జనవరి-2024) ప్రేక్షకుల ముందుకొచ్చింది. సంక్రాంతి పోటీలను లెక్కచేయకుండా ధైర్యంగా థియేటర్లలోకి అడుగు పెట్టిన ఈ సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? ప్రేక్షకుల మనసులను గెలుచుకుందా? తెలిసుకుందాం… కథ: అంజనాద్రి అని ఒక చిన్న పల్లెటూరు. సముద్ర తీర ప్రాంతంలో ఉండే ఊరు ఇది. ఆ ఊరిలో అల్లరి, చిల్లరిగా తిరుగుతూ, చిన్న చిన్న దొంగతనాలు చేసే దొంగ హనుమంతు (తేజ సజ్జ)తో…