యంగ్ టాలెంటెడ్ హీరో నందు విజయ కృష్ణ మరియు రష్మీ గౌతమ్ కలయికలో వస్తున్న తాజా చిత్రం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’. ఈ రోజు(గురువారం) నందు పుట్టినరోజు సందర్భంగా నందుని ‘పోతురాజు’గా పరిచయం చేస్తూ ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేసారు. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై నిర్మించబడిన ఈ చిత్రంలో హీరో నందు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌కి అభిమానిగా నటిస్తున్నారు. ఈ క్యారెక్టర్ చాలా వైవిధ్యంగా ఉండబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. పోతురాజుగా కనిపించబోతున్న నందు క్యారెక్టర్ కి ధీటుగానే హీరోయిన్ రష్మీ గౌతమ్ క్యారెక్టర్ ఉంటుందని, దీనికి సంబంధించిన వివరాల్ని అతి త్వరలోనే ప్రకటించబోతున్నామని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సినిమాతో రాజ్ విరాట్ దర్శకునిగా చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్‌తో అన్ని…