హైదరాబాద్, డిసెంబర్ 10 : తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండింటికి వెంటనే శ్రీకారం చుట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల హృదయాలను గెలుచుకున్నారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఎన్.ఆర్.ఐ గుంటుక వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న వెంకటేశ్వర్ రెడ్డి గతంలో తెలంగాణలో కాంగ్రెస్ నాయకుడిగా పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూనే, ఐఎన్ టీయూసీలో చురుకైన పాత్రని పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ లో నూతనోత్సాహం తీసుకొచ్చిన రేవంత్ రెడ్డికి ఈ సందర్బంగా ఆయన శుభాకాంక్షలు అందజేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం; ఆరోగ్యశ్రీ పథకంలో ప్రస్తుతం రూ.5 లక్షలు ఉన్న బీమా పరిమితిని…