విజయ్ దేవరకొండ మరియు పరశురామ్ కలిసి సినిమా చేయబోతున్నారన్న విషయాన్ని కొద్ది రోజుల ముందు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. గీత గోవిందం మరియు సర్కారు వారి పాట వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తీసిన పరశురామ్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా ను నిర్మాత దిల్ రాజు శిరీష్ లు నిర్మిస్తుండగా , క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరించనున్నారు. ఈ కాంబినేషన్ పై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. హైదరాబాదులో ఈరోజు ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టగా, ఫస్ట్ షార్ట్ ను గోవర్ధన్ రావు దేవరకొండ డైరక్ట్ చేశారు, ప్రముఖ ఫైనాన్షియర్ సత్తి రంగయ్య కెమెరాను స్విచ్ ఆన్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు…
Tag: మృణాల్ ఠాకూర్
నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్, శౌర్యువ్, వైర ఎంటర్టైన్మెంట్స్ #Nani30 జనవరి 31న ప్రారంభం
నేచురల్ స్టార్ నాని 30వ చిత్రం వైర ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం1 గా రూపొందనుందని న్యూ ఇయర్ సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ నిర్మిస్తునారు. తండ్రీకూతుళ్ల మధ్య అందమైన బంధాన్ని చూపించే హార్ట్ టచింగ్ వీడియో ద్వారా సినిమాలో నాని వరల్డ్ ని కూడా మేకర్స్ రివిల్ చేశారు. గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం ప్రారంభ పూజా కార్యక్రమం జనవరి 31న హైదరాబాద్‌లో జరగనుంది. ఫిబ్రవరి 1 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో నానికి జోడిగా నటించనున్నారు. ఈ చిత్రంలో కొంతమంది ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు…
