వెర్సటైల్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో కె హర్ష వర్ధన్ దర్శకత్వంలో రూపొందనున్న యూనిక్ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ ‘కూర్మ నాయకి’. రోహన్ ప్రొడక్షన్స్, ఎంఎం క్రియేషన్స్, కాలభైరవ ప్రొడక్షన్ బ్యానర్స్ పై కె విజిత రావు నిర్మిస్తున్న ఈ చిత్ర ఈ రోజు గ్రాండ్ గా ప్రారంభమైయింది.
ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత డి వి వి దానయ్య క్లాప్ ఇచ్చారు. లౌక్య సాయి కెమెరా స్విచ్ ఆన్ చేయగా బెక్కం వేణుగోపాల్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. హీరో తిరువీర్, శ్రీను గవి రెడ్డి మేకర్స్ కు స్క్రిప్ట్ అందజేస్తారు.
ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రామ్ డీవోపీ గా పని చేస్తున్నారు. చోటా కె ప్రసాద్ ఎడిటర్. స్నిగ్ధ మణికాంత్, పూజిత సహా నిర్మాతలు వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి రామాంజనేయలు ఆర్ట్ డైరెక్టర్.
మూవీ లాంచ్ ఈవెంట్ లో తిరువీర్ మాట్లాడుతూ.. ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అన్ని విషయంలో చాలా కేర్ తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తప్పకుండా ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
కె హర్ష వర్ధన్ మాట్లాడుతూ.. చాలా కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఒక దొంగ, దేవుడు, దెయ్యం నేపధ్యంలో వుంటుంది. ఇప్పుడు ఒక దేవుడు, దెయ్యాన్ని విడుదల చేస్తున్నాం. దొంగ ఎవరనేది త్వరలో ఆడియన్స్ పట్టుకుంటారు” అన్నారు.
మణికాంత్ మాట్లాడుతూ.. ఇది మా మొదటి ప్రొడక్షన్. హర్ష వర్ధన్ గారు కథ చెప్పగానే చాలా నచ్చింది. అవుట్ పుట్ ఒక భారీ బడ్జెట్ సినిమాలానే వుంటుంది” అన్నారు
నిర్మాతలు మాట్లాడుతూ.. డి వి వి దానయ్య గారికి, బెక్కం వేణుగోపాల్ గారికి, హీరో తిరువీర్ గారికి ఈ వేడుక విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. హర్ష చెప్పిన కథ చాలా నచ్చింది. మంచి టెక్నికల్ టీంతో సినిమాని ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నాం. కాన్సప్ట్ చాలా కొత్తగా వుంటుంది. తప్పకకుండా అందరినీ అలరిస్తుంది” అన్నారు.
నటీనటులు: వరలక్ష్మీ శరత్ కుమార్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె హర్ష వర్ధన్
రైటర్: శ్రీను గవిరెడ్డి
నిర్మాత : కె. విజిత రావు
సహా నిర్మాతలు : స్నిగ్ధ మణికాంత్, పూజిత
సంగీతం: శేఖర్ చంద్ర
డీవోపీ: రామ్
ఎడిటర్ : చోకా కే ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: రామాంజనేయలు
లైన్ ప్రొడ్యుసర్: శరత్
ఎగ్జిక్యూటీవ్ నిర్మాతలు: అనీల్ మైలాపూర్, షఫీ
పీఆర్వో: వంశీ శేఖర్
వరలక్ష్మీ శరత్ కుమార్ ‘కూర్మ నాయకి’ ప్రారంభం
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ 2024, మార్చి 8న విడుదల కానుంది!
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వినోదాత్మక మరియు వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని మరియు భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన తన తదుపరి చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కోసం రచయిత-దర్శకుడు కృష్ణ చైతన్య మరియు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చేతులు కలిపారు.
ప్రకటన నుంచే ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుకుంటూ పోతోంది చిత్ర బృందం. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, అలాగే ‘సుట్టంలా సూసి’ అనే మెలోడీ గీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచేశాయి.
ప్రముఖ నటి నేహా శెట్టి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. సుప్రసిద్ధ, ప్రతిభావంతులైన నటి అంజలి ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం చీకటి ప్రపంచంలో సాధారణ స్థాయి నుండి ధనవంతుడిగా ఎదిగిన వ్యక్తి యొక్క కథను వివరిస్తుంది. అతని కఠినమైన ప్రయాణం రాజకీయ చిక్కులను కూడా కలిగి ఉంటుంది. మేకర్స్ వాటి గురించి ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో సూచన చేశారు.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో విశ్వక్ సేన్ చాలా గ్రే క్యారెక్టర్‌లో కనిపిస్తారు. ఈ చిత్రం పట్ల ఎంతో నమ్మకంగా ఆయన, ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు చూపించడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమాని 2024 మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.
యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘సుట్టంలా సూసి’ పాట ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి, ఇన్నమూరి గోపీచంద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.
అనిత్ మధాడి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, గాంధీ నడికుడికర్ ప్రొడక్షన్ డిజైన్‌ను నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’లో నా కెరీర్ బెస్ట్ క్యారెక్టరైజేషన్ చేశా : హీరో నితిన్
టాలెంటెడ్, ఛర్మిస్మేటిక్ హీరో నితిన్ కథానాయకుడిగా వక్కంతం దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’. డిసెంబర్ 8న రిలీజ్ అవుతున్న ఈ సిినిమా ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్‌లో …
నిర్మాత ఎన్.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కి మమ్మల్ని సపోర్ట్ చేయటానికి వచ్చిన అభిమానులు, ప్రేక్షకులకు థాంక్స్. ఇప్పుడు సినిమా గురించి ఏం మాట్లాడను. రిలీజ్ తర్వాత మాట్లాడుతాను’’ అన్నారు.
డైరెక్టర్ వక్కంతం వంశీ మాట్లాడుతూ ‘‘ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుంది. ఈ ఔట్ పుట్ ఇవ్వటానికి నేను, నితిన్ రెండేళ్లు కష్టపడ్డాం. నిజానికి కష్టపడ్డామని చెప్పకూడదు. ఎందుకంటే అది మా బాధ్యత. అందరినీ ఎంటర్‌టైన్ చేయాలని రెండేళ్లు కష్టపడి చాలా జాగ్రత్తగా ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేశాం. అందరి సపోర్ట్ కావాలి. ట్రైలర్ కంటే పదిమింతలు మించి సినిమా ఉంటుంది. అందరికీ థాంక్స్’’ అన్నారు.
హీరో నితిన్ మాట్లాడుతూ ‘‘నటుడిగా నా 21 ఏళ్ల కెరీర్‌లో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ నా 32వ సినిమా. నేను చేసిన బెస్ట్ క్యారెక్టరైజేషన్ మూవీస్‌లో ఇది నెంబర్ వన్ అవుతుంది. వక్కంతం వంశీగారు రాసిన కిక్, రేసుగుర్రం, టెంపర్ సినిమాలన్నీ బావుంటాయి. వాటిన్నంటికీ తగ్గకుండా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీ ఉంటుంది. డిసెంబర్ 8న మూవీ రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయటమే ఈ మూవీ గోల్. నాన్ స్టాప్‌గా అందరినీ నవ్విస్తాం. స్క్రీన్ ప్లే కూడా కొత్తగా ఉంటుంది. మంచి కథ, పాటలు కూడా ఉంటాయి. అలాగే మంచి డాన్స్ కూడా ఉంటుంది. బాగా డాన్స్ చేసి చాలా కాలమవుతుంది. ఈ మూవీలో లాస్ట్ సాంగ్ మీ అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను. డిసెంబర్ 8న గుద్దబోతున్నాం. ఇది కన్‌ఫర్మ్.. రాసి పెట్టుకోండి.
ప్రముఖ నటుడు డాక్టర్ నరేష్ విజయకృష్ణకు అరుదైన గౌరవం- ఏఎంబి లెఫ్టినెంట్ కల్నల్ ‘సర్’ డాక్టరేట్ బిరుదు ప్రదానం
నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ప్లానింగ్ (NASDP), ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ & హ్యూమన్ రైట్స్ (ISCAHR), UNO ముఖ్యమైన విభాగం NATOతో రిజిస్టర్ చేయబడిన యూరోపియన్ యూనియన్, యుఎస్ఏ అనేక ఇతర దేశాలతో ఈ నెల 24న ఫిలిప్పీన్స్ (మనీలా)లోని క్యూజోన్ నగరంలోని లక్సెంట్ హోటల్‌లోని ఆటం హాల్‌లో 5వ ప్రపంచ కాంగ్రెస్ ని నిర్వహించింది.
ఈ సమావేశానికి NASDP సెక్రటరీ జనరల్ AMB జనరల్ సర్ దివాకర్ చంద్ర సర్కార్ అధ్యక్షత వహించారు. ఫిలిప్పీన్స్ దేశ పాలసీ అడ్వైజర్ చీఫ్ మిస్ క్లారిటా ఆర్ కార్లోస్, ఆరోగ్యమంత్రి, నేవీ, ఎయిర్ వింగ్ ,గ్రౌండ్ ఫోర్స్‌కు చెందిన 12 మంది మిలిటరీ జనరల్స్, అనేక మంది బ్రిగేడ్ జనరల్స్, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కల్నల్‌లు, దేశాల డిప్యూటీ మంత్రులు, దౌత్యవేత్తలు, థాయ్‌లాండ్, ఇతర దేశాల నుంచి ప్రతినిధులు, ఇండియా నుంచి డాక్టర్ నరేష్ విజయకృష్ణ సన్మానాలు స్వీకరించేందుకు హాజరయ్యారు.
పోలీస్, డిఫెన్స్ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఉగ్రవాదంపై డాక్టర్ నరేష్ చేసిన ఉపన్యాసాలు ప్రశంసలు అందుకున్నాయి.
డాక్టర్ నరేష్ విజయకృష్ణకు నైట్ హుడ్, అత్యున్నత బిరుదు ‘సర్’ ను ప్రదానం చేశారు. మిలిటరీ ఆర్ట్స్, హ్యూమన్ సర్వీస్‌లో గౌరవ డాక్టరేట్, పిహెచ్‌డితో సత్కరించారు. ఆర్బిట్రేషన్ & శాంతి మధ్యవర్తిత్వానికి సహచరుడిగా గుర్తించారు. పౌర హక్కుల సంరక్షకుడు బిరుదుతో గౌరవించారు.
అంతర్జాతీయంగా పూర్తి దౌత్య నిరోధక శక్తితో NASDP ఇంటర్నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్‌లో మిలిటరీ ఆర్ట్స్ గుడ్ విల్ అంబాసిడర్, లెఫ్టినెంట్ కల్నల్, సూపరింటెండెంట్ ఆఫ్ ఇండియన్ కమాండ్‌గా డాక్టర్ నరేష్ విజయకృష్ణ నియమించబడ్డాడు.
డాక్టర్ నరేష్ తన స్వాగత ప్రసంగంలో.. ప్రభుత్వాలు, ఐక్యరాజ్యసమితి సంస్థలతో పాటు ఉగ్రవాదాన్ని నిర్వీర్యం చేయడం, అరికట్టడంలో మీడియాకు గొప్ప బాధ్యత వుందని చెప్పారు. ఈ కాంపెయిన్ ని ఒక సెలబ్రిటీ, దౌత్యవేత్తగా ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు.
ప్రతి విద్యార్థిని జాతీయ క్యాడెట్ కార్ప్స్ (భారతదేశంలోని సాయుధ దళాల విద్యార్థి విభాగాలు), ఇతర దేశాలలో దేశం పట్ల బాధ్యత భావాన్ని తీసుకురావడానికి నియమించాలని అన్నారు.
AMB లెఫ్టినెంట్ కల్నల్ సర్ Ph.D గౌరవం అందుకున్న డాక్టర్ నరేష్ విజయకృష్ణకు ప్రముఖులు అభినందించారు.
దేశంలో ఇలాంటి గౌరవాలు, పోస్టింగ్‌లు అందుకున్న మొదటి నటుడు నరేష్. థాయ్‌లాండ్‌కు చెందిన డాక్టర్ క్రిజ్, లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, యూనివర్శిటీ అధినేత డాక్టర్ సురేష్ అగర్వాల్, ప్రముఖ నటి పవిత్రా లోకేష్ సమావేశానికి హాజరై కళారంగంలో అందించిన సేవలకుగాను మెడల్ అందుకున్నారు.
నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని చిత్ర పరిశ్రమలో తన స్వర్ణోత్సవ జరుపుకున్న డాక్టర్ నరేష్ విజయకృష్ణకు ఇది మరో అరుదైన గౌరవం.
Actor Naresh is now referred to as AMB Lt. Colonel Sir Dr Naresh Vijayakrishna Ph.D
The National Academy of Security and Defence Planning (NASDP) and International Special Court of Arbitration & Human Rights (ISCAHR), an important wing of UNO (registered with NATO, European Union, USA and many other countries held its 5th World Congress in Autumn Hall in Luxent hotel in Quezon city in the Philippines (Manila) on the 24th of this month.
The meeting was preceded by AMB Gen. Sir Diwakar Chandra Sarkar, Secretary General Of NASDP. The chief policy advisor of the Philippines country Miss Clarita R Carlos, the minister for health 12 Military generals from the navy, Air wing, and ground force several brigade generals, inspector general of police, colonels, deputy ministers of the countries, diplomats, and delegates from Thailand and other countries along with Dr Naresh Vijayakrishna from India attended to take the honours.
Dr Naresh’s lectures on terrorism in the national headquarters of the Police and defence earned him a good appreciation.
Dr Naresh Vijayakrishna was conferred with Knighthood and the high title of ‘Sir’ was awarded to him. He was conferred with an Honorary Doctorate In Military Arts And Human Service and a PhD, recognising him as a Fellow, of Arbitration & Peace Mediation.
He was accredited with the title Civil Rights Defender.
He has been appointed as a Good Will Ambassador Of Military Arts, Lieutenant Colonel and Superintendent of Indian Command In The NASDP’s International Counter Terrorism Centre With Full Diplomatic Immunity Internationally.
In his welcome address, Dr Naresh said that the media has a great responsibility towards demoralising and curbing terrorism along with the governments and United Nations Organisations and mentioned that he would take this campaign forward as a celebrity and a diplomat.
He also said that every student should be recruited in the national Cadet Corps (student wings of the Armed Forces in India) and other countries to bring about a sense of responsibility toward the nation.
He is now referred to as AMB Lt. Colonel Sir Dr Naresh Vijayakrishna Ph.D. He was congratulated by the Dignitaries for the new appointment and honours.
Naresh is the first actor in India to receive such honours and postings. Dr Krizz from Thailand, Dr Suresh Agarwal, a lifestyle specialist and head of a university, and veteran actress Pavithra Lokesh attended this August gathering and received a medal for service in arts.
Naresh has completed 50 years as an actor and in his golden Jubilee year in the film industry, it is certainly a feather in his cap and a rare honour for an actor.
‘కోట బొమ్మాళీ పీఎస్’ లాంటి సినిమా తీయాలంటే గట్స్ వున్న నిర్మాతలు కావాలి: హీరో శ్రీకాంత్
శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని ముఖ్యతారలుగా తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటూ బ్లాక్‌బస్టర్ చిత్రంగా విజయపథంలో దూసుకెళుతోంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన బన్నీవాస్ మాట్లాడుతూ సినిమా కంటెంట్ బాగుంటే మీడియా తప్పకుండా ప్రోత్సహిస్తుందనే విషయాన్నీ ఈ చిత్రానికి వారు అందిస్తున్న సపోర్టుతో మరో సారి ప్రూవ్ అయింది. నాయట్టు అనే క్లాసిక్ చిత్రాన్ని తెలుగులో కమర్షియల్ హంగులతో చేస్తున్నప్పుడు మొదట్లో కాస్త భయపడ్డాను. కానీ ఈ రోజు మీడియా రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంగా వుంది. నిజాయితీగా సినిమా చేశాం. ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మార్నింగ్ వసూళ్లు తక్కువ వున్నా ఫస్ట్ షో టైమ్‌కు మౌత్‌టాక్ తో కలెక్షన్లు పెరిగాయి. ఇదే మా సినిమా సక్సెస్‌కు నిదర్శనం. ఓ మంచి సినిమా తీశాను అది జనాలకు నచ్చిందనే విషయాన్ని మాత్రం కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. తేజ మార్ని ఎంతో ప్రతిభ గల దర్శకుడు. ఈ రోజు చిత్రంలో ప్రతి సన్నివేశానికి క్లాప్స్ పడుతున్నాయంటే అతనే కారణం. భవిష్యత్‌లో అతను మంచి కమర్షియల్ దర్శకుడిగా ఎదుగుతాడు. శ్రీకాంత్ అన్నయ్య సొసైటీకి ఉపయోగపడే పాత్ర ఎప్పూడు చేసిన ఆ సినిమా సక్సెస్ అవుతుందని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. తప్పకుండా ఈ చిత్రం మరింత జనాదరణ పొందుతుందనే నమ్మకం వుంది* అన్నారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ మీడియా మిత్రులు చాలా మంది ఫోన్ చేసి అభినందిస్తుంటే ఆనందంగా వుంది. ఖడ్గం, ఆపరేషన్ దుర్యోదన రోజులు గుర్తొచ్చాయని అందరూ అంటున్నారు. ఈ మధ్యకాలంలో నాకు ఏ చిత్రానికి ఇన్ని ప్రశంసలు రాలేదు. ఇలాంటి సినిమా తీయాలంటే గట్స్ వున్న నిర్మాతలు కావాలి. ఆ గట్స్ నాకు వాసు, విద్యలో కనిపించాయి. మొదట్లో ఈ చిత్రంలో నా పాత్రను చేయగలనా అనుకున్నాను. కానీ ధైర్యంగా ఛాలెంజింగ్‌గా తీసుకుని చేశాను. నా కెరీర్‌ను మలుపుతిప్పిన గీతా ఆర్ట్స్ సంస్థలో మళ్లీ నాకు మరో మంచి సక్సెస్ రావడం సంతోషంగా వుంది. ఈ చిత్ర దర్శకుడు తేజ గొప్ప దర్శకుడుగా ఎదుగుతాడు అన్నారు. ఎంతో కష్టపడి , అందరి సహకారంతో చేసిన ఈ సినిమాకు ఈ రోజు ఇంత మంచి ఆదరణ దొరకడం హ్యపీగా వుందని దర్శకుడు తేజ మార్ని తెలిపారు. శివాని మాట్లాడుతూ సినిమాలో నా నటన గురించి అందరూ అమ్మకు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. మంచి కంటెంట్‌తో సినిమ తీస్తే తెలుగు ఆడియన్స్ ఎప్పూడు ఆదరిస్తారని ఈ చిత్ర విజయం మరోసారి నిరూపించింది. మౌత్ టాక్‌తో ఈ సినిమాకు ఆదరణ పెరుగుతుంది. ఇదే ఈ చిత్ర సక్సెస్‌కు నిదర్శనం అన్నారు. హీరో రాహుల్ విజయ్ మాట్లాడుతూ ఇదొక నిజాయితీ అంటెప్ట్. సొసైటిలో జరుగుతున్న దానికి రిఫ్లక్షన్ ఇది. శ్రీకాంత్ గారి పాత్ర నా కళ్లలో నీళ్లు తెప్పించింది. నా పాత్రకు కూడా మంచి ప్రశంసలు వస్తున్నాయి అన్నారు. సినిమా విజయం పట్ల సహ నిర్మాత భాను తన ఆనందాన్ని తెలిపారు.
తండ్రి కొడుకుల కథ ‘యానిమల్’ అందరినీ అలరిస్తుంది: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా
రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘యానిమల్’ ప్రమోషనల్ కంటెంట్ తో సెన్సేషన్ సృష్టించింది. ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచింది. ‘యానిమల్’లో రణ్‌బీర్ కపూర్ కు జోడిగా రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్ టి-సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 5 భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విలేకరులు సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
సందీప్ గారు.. ముందుగా మీకు కంగ్రాట్స్.. తెలుగు నుంచి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ బిగ్గెస్ట్ స్టార్స్ తో యానిమల్ లాంటి భారీ చిత్రాలు చేసినందుకు.
-థ్యాంక్ యూ సో మచ్ అండీ
మీ తొలి చిత్రం అర్జున్ రెడ్డిలో ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమకథ కనిపించింది. యానిమల్ ట్రైలర్ చూస్తే ఇది తండ్రికొడుకుల ప్రేమకథ అనిపిస్తుంది.
-అవునండీ. ఒక విధంగా దీన్ని తండ్రి కొడుకుల ప్రేమకథగా అనుకోవచ్చు. ప్రైమరీ స్టొరీ అదే. ఒక వ్యక్తి కుటుంబం కోసం ఎంత దూరం వెళ్తాడనేది కథ యొక్క సారాంశం.
అర్జున్ రెడ్డి పాత్రలో చాలా కోపం వుంటుంది. యానిమల్ లో రణ్‌బీర్ పాత్రలో కూడా ఆ ఛాయలు కనిపిస్తున్నాయి. పాత్రలు పరంగా అర్జున్ రెడ్డికి యానిమల్ కి సిమిలారిటీస్ ఉన్నాయా ?
-ఇద్దరూ చాలా నిజాయితీ వున్న వ్యక్తులు(నవ్వుతూ). అదొక్కటే కామన్ ఫ్యాక్టర్. అర్జున్ రెడ్డి కోపం వస్తే కంట్రోల్ చేయలేని పాత్ర. యానిమల్ పాత్రకు మాత్రం సామాన్యంగా అందరి వ్యక్తులకు వుండే కోపమే వుంటుంది. అర్జున్ రెడ్డి, యానిమల్.. ఈ రెండూ కూడా క్యారెక్టర్ బేస్డ్ సినిమాలే. అదొక సిమిలారిటీగా చెప్పొచ్చు. ఇది తప్పించి కథ, పాత్ర కంప్లీట్ డిఫరెంట్ గా వుంటుంది.
మీ చిత్రాలలో హీరో పాత్రని తీవ్రమైన ఎమోషన్, ఇంటెన్స్ తో డిజైన్ చేయడానికి కారణం ?
అర్జున్ రెడ్డి విషయానికి వస్తే.. ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా వుండే పాత్ర అది. అలాంటిది ప్రేమ దూరమైనపుడు సహజంగానే ఇంటెన్స్ ఎమోషన్ వుంటుంది. యానిమల్ లో తండ్రి కోసం ఏదైనా చేయగలిగే ఓ కొడుకు పాత్రని రాసుకున్నపుడు, అతని ఎమోషనల్ కోషేంట్ సహజంగానే హై వుంటుంది. ఎమోషనల్ గా హై వున్న వాళ్ళే అలా చేయగలుగుతారు. అంతే గానీ కావాలని చేసింది కాదు.
ట్రైలర్ చూస్తే ఎమోషన్ చాలా కనిపిస్తోంది. అయితే ఆ ఎమోషన్ ని వైలెన్స్ డామినేట్ చేస్తుందా ? ఇందులో ఎమోషన్, వైలెన్స్ ఏది ఎక్కువ వుంటుంది ?
-ఎమోషన్, వైలెన్స్ అన్నీ సరిగ్గా బ్యాలెన్స్ చేశాననే అనుకుంటున్నాను(నవ్వుతూ) చూసి మీరు చెప్పాలి.
‘నా తర్వాత సినిమాలో వైలెన్స్ ఎలా వుంటుందో చూపిస్తా’ అని మీరు ఓ సందర్భంలో చెప్పడం చాలా వైరల్ అయ్యింది కదా ?
-దాని గురించి మీకు చెప్పాలి(నవ్వుతూ). అర్జున్ రెడ్డి మన తెలుగులో యునానిమస్ గా అందరికీ నచ్చింది. దాదాపు అందరు విమర్శకులు కూడా ప్రశంసించారు. అదే సినిమా హిందీలో చేసినప్పుడు అందరికీ నచ్చింది. కానీ అక్కడ కొంతమంది విమర్శకులు అందులో వైలెన్స్ ఎక్కువ వుందని అన్నారు. మన సెన్సిబిలిటీస్ కి వాళ్ళకి తేడా ఉందని అనుకున్నా. ఆ సమయంలో ఒక ఇంటర్వ్యూ లో ‘మీ నెక్స్ట్ సినిమాకి ఇంత వైలెన్స్ వుండకూడదు’ అని అనడంతో.. మామూలు కాలేజీలో జరిగే ప్రేమకథే వాళ్లకి వైలెన్స్ అనిపించిందికదా.. తండ్రి కోసం ఏదైనా చేసే కొడుకు పాత్ర ఇంకెంత వైలెన్స్ గా అనిపిస్తుందనే ఉద్దేశంతో.. ‘నా నెక్స్ట్ సినిమాలో వైలెన్స్ అంటే ఏమిటో చూపిస్తా’’ అన్నాను. అది చాలా వైరల్ అయిపొయింది.( నవ్వుతూ)
అర్జున్ రెడ్డిలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత వుంటుంది. మరి యానిమల్ లో రష్మిక పాత్రకు కథలో ఎలాంటి ప్రాముఖ్యత వుంటుంది ?
-రష్మిక గారిది చాలా ముఖ్యమైన పాత్ర. సినిమా ఆద్యంతం వుంటుంది. రెగ్యులర్ గా కాకుండా చాలా డిఫరెంట్ గా వుంటుంది. హీరోని పేరెంట్స్ కంటే ఎక్కువ అర్ధం చేసుకున్న పాత్ర. ఇందులో హీరో తర్వాత సమాన ప్రాధన్యత వున్నది రష్మిక, అనిల్ కపూర్ పాత్రలకే. ఇందులో మంచి ప్రేమకథ కూడా వుంటుంది.
యానిమల్ రన్ టైం దాదాపు మూడు గంటల ఇరవై నిముషాలు వుంది కదా..అది ప్రతికూలమయ్యే అవకాశం ఉందా ?
-లేదండీ. అర్జున్ రెడ్డి మూడు గంటల ఆరు నిమిషాల సినిమా. అది ఒక అమ్మాయి అబ్బాయి కథే. యానిమల్ లో ఒక కుటుంబం, ప్రత్యర్ధులు ఇలా లేయర్స్ వున్నాయి. అర్జున్ రెడ్డి కంటే పదిహేను నిముషాలకే ఎక్కువ. ఇంకొ పది నిముషాలు హాయిగా ఏసీలో కూర్చుని సినిమాని ఎంజాయ్ చేస్తారనే నమ్మకం వుంది.
రణ్‌బీర్ కపూర్ లాంటి బిగ్గెస్ట్ స్టార్ తో పని చేయడం ఎలా అనిపించిది ?
రణ్‌బీర్ కపూర్ చాలా గొప్ప వ్యక్తిత్వం వున్న మనిషి. ఒక పెద్ద స్టార్, ఇన్ని సినిమాల అనుభవం వుందనే భావన ఆయన ఎప్పుడూ చూపించలేదు. ఆయనకి కథ చెప్పాను. నచ్చింది. తర్వాత కథ గురించి సినిమా గురించి మాట్లాడుకోవడమే కానీ మరో చర్చ వుండేది కాదు. విజయ్ తో నా మొదటి సినిమా అర్జున్ రెడ్డికి పని చేసినప్పుడు ఎలా ఉండేదో..రణ్‌బీర్ తో పని చేసినప్పుడు కూడా అలానే అనిపించింది. ఇక రణ్‌బీర్ కపూర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోనే తను అత్యుత్తమ నటుడు.
ఈ సినిమాకి ‘యానిమల్’ అనే పేరు పెట్టడానికి కారణం ?
మనకి చదువు, తెలివితేటలు వచ్చి హ్యూమన్ బీయింగ్ అని పేరుపెట్టుకున్నాం. అయితే మాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. మనకి ఐక్యూ వుండి, కమ్యునికేషన్ పెరిగి, ఫుడ్ చెయిన్ లో మొదటిగా ఉంటూ వస్త్రాలు ధరించాం. కానీ అవి లేకపోతే యానిమల్ కదా అనేది నా పర్శనల్ ఫీలింగ్. చిన్నప్పుడు సోషల్ స్టడీస్ చదువుకునప్పుటి నుంచి అలానే అనిపించేది. అయితే నేను అలోచించినది ఏమిటంటే.. యానిమల్ కు ఐక్యు వుండదు. తన ప్రవృత్తి (instinct) తో ప్రవర్తిస్తుంటుంది. ఇందులో హీరో పాత్ర కూడా ఇన్స్టింక్ట్ గా బిహేవ్ చేస్తుంది. అలాంటి పాత్రకు సంభదించిన కథకు ‘యానిమల్’ అనే టైటిల్ బాగుటుందని ఈ పేరు పెట్టడం జరిగింది.
ఇందులో అనిల్ కపూర్, బాబీ డియోల్ పాత్రలు ఎలా వుంటాయి ?
యానిమల్ కథలో అనిల్ కపూర్ గారిది కీలక పాత్ర. అతని వలనే అతని గురించే డ్రైవ్ అవుతుంది. బాబీ డియోల్ విలన్ గా కనిపిస్తారు. ఆ పాత్రల గురించి ఎక్కువ రివిల్ చేయకూడదు. తెరపై చూడాల్సిందే.
యానిమల్ లో రివెంజ్ కోణం చాలా బలంగా ఉన్నట్లు అనిపిస్తోంది ?
అవును. రివెంజ్ ని కంటిన్యూ చేయడం మామూలు ఎనర్జీ కాదు. ప్రేమ కంటే రివెంజ్ లో ఎక్కువ ఎనర్జీ వుందని అనిపించింది. రివెంజ్ సాధించాడా ? లేదా అనే మాట కంటే ఆ ప్రయాణం పట్టుకోవడం చాలా కష్టమైన విషయం. మీరు గమనిస్తే వార్ చిత్రాలలో కూడా బలమైన రివెంజ్ వుంటుంది. యానిమల్ రాస్తున్నప్పుడు కూడా ప్రేమ కంటే రివెంజ్ పెద్ద ఎమోషన్ అనిపించింది.
యానిమల్ పాటలు డిఫరెంట్ కంపోజర్స్ తో చేశారు కదా.. ఆ అనుభవం ఎలా అనిపించింది. హర్ష వర్షన్ రామేశ్వర్ నేపధ్య సంగీతం గురించి ?
-నా సినిమాలో సౌండ్, మ్యూజిక్ కి చాలా ప్రాధన్యత ఇస్తాను. ముంబైలో సోలో కంపోజర్ తో వెళ్ళడం కష్టమైపోయింది. అయితే కబీర్ సింగ్ సినిమా అయ్యేసరికి నాకు కొంచెం అది అలవాటైయింది. డిఫరెంట్ కంపోజర్స్ తో వెళితే అందరికీ కథ నేరేట్ చేయాలి. దాని కోసం ప్రత్యేకంగా శ్రమ తీసుకోవాలి. మ్యూజిక్ అంతా ఒక ఆల్బమ్ గా బ్యాలెన్స్ చేయడం కోసం కూడా ఎఫర్ట్ పెట్టాలి. దానిపై ఒక అవగాహన వుంది కాబట్టి నాకు అది వర్క్ అవుట్ అవుతుంది. హర్ష వర్షన్ రామేశ్వర్ నేపధ్య సంగీతం చేశారు. మాకు మంచి సింక్ కుదిరింది. చాలా అద్భుతంగా చేశాడు.
‘యానిమల్’కు మీ అన్నయ్య గారు కూడా ఒక నిర్మాత.. దీని గురించి ?
నన్ను క్రియేటివ్ పరంగా క్రిటిసైజ్ చేసేది మొదటి నుంచి మా అన్నయ్యే. అర్జున్ రెడ్డిని అన్నయ్యే నిర్మించారు. మనం ప్రొడక్షన్ లో వుంటే క్రియేటివ్ గా కూడా కంట్రోల్ వుంటుంది. భూషణ్ గారితో కబీర్ సింగ్ కి కలిసి పని చేశాను. ఆయన కూడా క్రియేటివ్ గా చాలా ఫ్రీడమ్ ఇస్తారు.
యానిమల్ చిత్రానికి ఎడిటర్ గా కూడా చేయానికి కారణం ?
నేను ఎడిటింగ్ చేస్తా. ఎడిటింగ్ చాలా ఇష్టం. నిజానికి అది చాలా కష్టమైన పని. అయితే నా సినిమా నా కంటే ఎక్కువగా ఎవరికీ అర్ధం కాదనేది నా భావన. అయితే ఇంకా బెటర్ గా చేసే వాళ్ళు వుంటే ఖచ్చితంగా ఇచ్చేస్తా. అలా అయితే నాకు చాలా సమయం కూడా కలిసొస్తుంది.(నవ్వుతూ)
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ లాంటి రెండు పెద్ద విజయాల తర్వాత వస్తున్న యానిమల్ పై చాలా అంచనాలు వున్నాయి కదా.. ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ?
-నిజంగా నేను అలాంటి ఒత్తిడి తీసుకొను. ఇన్స్టింక్ట్ గా ఆలోచించడం. మంచి అవుట్ పుట్ ఇవ్వడంపైనే ద్రుష్టి ఉంటుంది కానీ మిగతా విషయాలపై ఒత్తిడి తీసుకొను.
యానిమల్ లిరిక్స్, యాక్షన్ కొరియోగ్రఫీ గురించి ?
– లిరిక్స్ అనంత శ్రీరాం సింగిల్ కార్డ్ రాశారు. లిరిక్స్ తెలుగు నేటివిటీకి తగట్టుగా వున్నాయని మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. పాటలు, రిలిక్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
-యాక్షన్ సుప్రీం సుందర్ గారు చేశారు. ఆయన చాలా సాఫ్ట్ పర్సన్. యాక్షన్ మాత్రం వైల్డ్ గా చేశారు.
హీరో పాత్రకు తెలుగులో డబ్బింగ్ చెప్పింది ఎవరు ?
-ఇందులో హీరో పాత్రకు తెలుగులో డబ్బింగ్ చెప్పింది వాసు గారు. చాలా అద్భుతంగా చెప్పారు. ఎమోషన్ ని చక్కగా క్యారీ చేశారు. రష్మిక తెలుగు, కన్నడ, హిందీలో స్వయంగా డబ్బింగ్ చెప్పింది.
అన్ స్టాపబుల్ షో లో బాలయ్య గారిని కలవడం ఎలా అనిపించింది ?
అన్ స్టాపబుల్ షో చూసి షాక్ అయ్యాను. ఈ ప్రోగ్రాం ఎవరు డిజైన్ చేశారో కానీ వాళ్లకు హ్యాట్సప్. ఎందుకంటే బాలయ్యబాబు గారు అంటే సీరియస్ గా వుంటారనే ఇమేజ్ వుంది. కానీ ఆ షో చూసిన తర్వాత ఆయన ఇంత సరదాగా వున్నారనిపించింది. బాలకృష్ణ గారు చెప్పిన మొఘల్-ఈ-ఆజం డైలాగులకు రణ్‌బీర్ కపూర్ మతిపోయింది. అది రణ్‌బీర్ కపూర్ ముత్తాత సినిమా. అందులో డైలాగులు రణ్‌బీర్ కి కూడా గుర్తు లేవు. బాలకృష్ణ గారు చెప్పిన డైలాగులు విని నేను ఆలోచనలో పడిపోయాను. అసలు అంత మెమరీ ఎలా వుంటుందని షాక్ అయ్యాను. మామూలు డైలాగులు కావు అవి. బాలకృష్ణ గారి ఫ్యాన్ అయిపోయా. తెలుగులో కాదు నార్త్ లో కూడా ఇప్పుడా డైలాగులు ఎవరికీ గుర్తుఉండవు. కొత్తగా ఆడిషన్స్ కి వెళ్ళే నటులు కూడా ఆ డైలాగులు చెప్పరు. ఎందుకంటే అవి చాలా కష్టమైనవి.
మీరు చేయబోయే నెక్స్ట్ సినిమా ప్రభాస్ గారిదేనా ?
అవునండీ, జూన్ నుండి ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుంది, ఈ గ్యాప్ లో ట్రీట్ మెంట్ డైలాగ్స్ పై వర్క్ చేయాలి.
ప్రభాస్, అల్లు అర్జున్ గారి తర్వాత ఇంకెవరికైనా కథలు చెప్పారా ?
మహేష్ బాబుగారికి ఓ కథ చెప్పాను. అది ఆయనకి నచ్చింది. అయితే వేరే కమిట్మెంట్స్ వలన ముందుకు వెళ్ళలేదు. మహేష్ బాబు, రామ్ చరణ్ గారు.. ఇలా అందరితోనూ సినిమాలు చేయాలని వుంటుంది.
వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ హీరోగా మూన్‌షైన్ పిక్చర్స్ ప్రొడక్షన్ నెం.1 కాన్సెప్ట్ పోస్టర్ విడుదల.. త్వరలోనే షూటింగ్
చక్కటి హావ భావాలు, నటనతో యాక్టర్‌గా తనదైన గుర్తింపును సంపాదించుకున్న తిరువీర్.. పరేషాన్, జార్జ్ రెడ్డి, పలాస 1978, మసూద వంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో పెర్ఫామెన్స్ పరంగా మెప్పించిన తిరువీర్ సినీ ఇండస్ట్రీలో ప్రశంసలు అందుకున్నారు.
ప్రస్తుతం మల్టీపుల్ ప్రాజెక్ట్స్‌తో తిరువీర్ బిజీగా ఉన్నారు. మరిన్ని డిఫరెంట్ ప్రాజెక్ట్స్ పైప్‌లైన్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో తిరువీర్ కొత్త సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై సాయి మహేష్ చందు, సాయి శశాంక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజ్ విరాట్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ద్రిష్టి తల్వార్ హీరోయిన్‌గా నటిస్తోంది.
రెండు వేర్వేరు ప్రపంచాలు కలయికగా యూనిక్‌నెస్‌తో కాన్సెప్ట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. డార్క్ కామెడీ జోనర్‌లో ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందని నిర్మాతలు తెలిపారు. తిరువీర్ మరో విలక్షణమైన పాత్రలో మెప్పించనున్నారు. త్వరలోనే షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. లియోన్ జేమ్స్ సంగీత సారథ్యం వహించనున్న ఈ చిత్రానికి సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె.ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేయనున్నారు.
నటీనటులు: తిరువీర్, ద్రిష్టి తల్‌వార్
సాంకేతిక వర్గం: బ్యానర్: ఏ మూన్‌షైన్ పిక్చర్స్ , నిర్మాతలు: మహేష్ చందు, సాయి శశాంక్, రచన, దర్శకత్వం: రాజ్ విరాట్, మ్యూజిక్: లియోన్ జేమ్స్, సినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థ్, ప్రొడక్షన్ డిజైనర్: రామ్ అరసవిల్లి, ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్, కాస్ట్యూమ్స్: సంతోష్ కుమార్, పి.ఆర్.ఒ: వంశీ కాకా.
శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోన్న ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’
హారర్ కామెడీ జోనర్‌లో అంజలి ప్రధాన పాత్రధారిగా నటించిన బ్లాక్‌బస్టర్ `గీతాంజలి`ను అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోలేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో హారర్ కామెడీ జోనర్‌లో గీతాంజలి మూవీ ఓ ట్రెండ్ సెట్ చేసింది. ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చేస్తోంది గీతాంజలి అంటూ గీతాంజలి సీక్వెల్‌ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే పేరుతో సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అచ్చ తెలుగు అమ్మాయి అంజలి నటిస్తోన్న 50వ సినిమా ఇది.
హారర్ కామెడీ జోనర్‌లో భారీ బడ్జెట్‌తో హ్యూజ్ రేంజ్ మూవీగా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ని మేకర్స్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ‘గీతాంజలి’ సినిమా ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే సీక్వెల్ స్టార్ట్ అవుతుంది. అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్‌లతో పాటు ఈ సీక్వెల్‌లో సత్య, సునీల్, రవిశంకర్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాలో మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు రాహుల్ మాధవ్‌ను టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరి చయం చేస్తున్నారు మేకర్స్. ఇప్పటి వరకు వచ్చిన హారర్ కామెడీ చిత్రాలన్నీ ఒక ఎత్తైతే ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’లో హారర్ కామెడీ వాటన్నింటినీ మించేలా ఉంటుంది. హైదరాబాద్, ఊటీల్లో ఈ సినిమా కథాంశం సాగుతుంది.
యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటానికి ఎప్పుడూ ముందుండే కోన ఫిల్మ్ కార్పొరేషన్ ఈ సినిమా ద్వారా తన మార్క్‌ను చాటుకుంటోంది. నిన్ను కోరి, నిశ్శబ్దం చిత్రాలకు కొరియోగ్రఫీ చేసిన అట్లాంటా (యు.ఎస్)కు చెందిన కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటిని డైరెక్టర్‌గా ఈ చిత్రంతో పరిచయం చేస్తున్నారు. ‘ఇప్పటి వరకు 80 శాతం చిత్రీకరణను పూర్తి చేశాం. ఊటీలో ఓ షెడ్యూల్‌ను చిత్రీకరించాల్సి ఉంది. ఆ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. సినిమాను వచ్చే 2024 ప్రారంభంలో దక్షిణాది భాషల్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు.
నటీనటులు: అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, అలీ, సునీల్, సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, రవిశంకర్, ప్రియ, ముక్కు అవినాష్, విరుపాక్ష రవి, రాహుల్ మాధవ్ తదితరులు.
సాంకేతిక వర్గం: బ్యానర్స్:ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్, నిర్మాతలు: ఎంవీవీ సత్యనారాయణ, జీవీ, దర్శకత్వం: శివ తుర్లపాటి, కథ: కోన వెంకట్, స్క్రీన్ ప్లే: కోన వెంకట్, భాను కిరణ్, మాటలు: భాను కిరణ్, నందు , సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, కెమెరా: సుజాత సిద్ధార్థ్, ఎడిటర్: చోటా కె ప్రసాద్, ఆర్ట్: నార్ని శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నాగు వై, పీ ఆర్ ఓ: వంశీ కాక, పబ్లిసిటీ డిజైనర్: అనిల్ భాను.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పాన్ ఇండియా మూవీ ‘మట్కా’ డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలో తిరిగి యాక్షన్ లోకి దిగుతున్నారు. పలాస ఫేమ్ దర్శకుడు కరుణ కుమార్‌తో కలిసి తన తొలి పాన్ ఇండియన్ చిత్రం ‘మట్కా’ రెగ్యులర్ షూట్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించనున్న ఈ చిత్రం డిసెంబర్ నుండి సెట్స్‌పైకి వెళ్లనుంది.
ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్‌తో టీమ్ బిజీగా ఉంది. 1958-1982 మధ్య జరిగే కథ కావడంతో 50, 80ల మధ్య వాతావరణాన్ని రిక్రియేట్ చేయడానికి భారీ సెట్‌లు రూపొందించారు. యావత్ దేశాన్ని కదిలించిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కనున్న ఈ కథ వైజాగ్ నేపథ్యంలో సాగుతుంది. హైదరాబాద్‌లో ఓల్డ్ వైజాగ్ సిటీని తలపించే భారీ సెట్‌ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను వుంటాయి. నలుగురు ఫైట్ మాస్టర్‌లు యాక్షన్ ని పర్యవేక్షిస్తారు.
24 ఏళ్ల స్పాన్ కలిగిన కథలో వరుణ్ తేజ్ నాలుగు విభిన్నమైన గెటప్‌లలో కనిపించనున్నారు. వరుణ్ తేజ్ కు హయ్యస్ట్ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌గా ఉండే ఈ సినిమా కోసం వరుణ్ పూర్తి మేక్ఓవర్ అవుతున్నారు.
వరుణ్ తేజ్ సరసన నోరా ఫతేహి , మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర, కన్నడ కిషోర్ కీలక పాత్రల్లో కనిపిస్తారు.
ఈ చిత్రానికి అద్భుతమైన సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు. సౌత్‌లో అత్యంత బిజీ గా ఉన్న కంపోజర్‌లలో ఒకరైన జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్. ఆశిష్ తేజ ప్రొడక్షన్ డిజైనర్, సురేష్ ఆర్ట్ డైరెక్టర్.
‘మట్కా’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
తారాగణం: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, కన్నడ కిషోర్, అజయ్ ఘోష్, మైమ్ గోపి, రూపలక్ష్మి, విజయరామరాజు, జగదీష్, రాజ్ తిరందాస్
సాంకేతిక విభాగం:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాతలు: మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల
బ్యానర్: వైర ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ప్రొడక్షన్ డిజైన్: ఆశిష్ తేజ
ఆర్ట్: సురేష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఆర్కే జానా
పీఆర్వో: వంశీ-శేఖర్