పాన్-ఇండియా లెవెల్లో ఉచితంగా సోనూసూద్ ఆక్సిజన్ పంపిణీ

గత ఏడాది నుంచి కరోనా వైరస్ తో ఎంతగానో ఇబ్బంది పడుతున్న పేద వారికి సోనూసూద్ నిర్విరామంగా సహాయలు చేస్తున్న విషయం తెలిసిందే. డబ్బును ఏ మాత్రం లెక్క చేయకుండా తన సొంత ఖర్చులతో కష్టాలు లేకుండా చేస్తున్నాడు. ఇక సెకండ్ వేవ్ లో సోనూసూద్ సహాయల సంఖ్య మరింత ఎక్కువగా మారింది.సహాయం చేయడానికి ఎంత దూరమైనా వెళతాను అని మాట ఇచ్చేశాడు. అన్నట్లుగానే ఆక్సిజన్ ప్లాంట్స్ ను జెట్ స్పీడ్ లో నిర్మించి ఎంతోమందికి ఊపిరి పోస్తున్నాడు. ఇక ఇప్పుడు మరొక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆక్సిజన్ సిలిండర్స్ కోసం దేశమంతా ఆర్థనాధాలు వినిపిస్తుండడంతో ఎవరు ఎంత దూరం నుంచి అడిగినా కూడా ఆక్సిజన్ సిలిండర్ పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరికి అవసరం ఉన్నా కూడా www.umeedbysonusood.com కు లాగిన్ అవ్వాలని కోరారు. ఆక్సిజన్ సిలిండర్స్…

రొమాంటిక్ థ్రిల్లర్ ‘తీరం’ మోషన్ పోస్టర్ విడుదల

అకి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు, క్రిష్టెన్ రవళి, అపర్ణ హీరో, హీరోయిన్లుగా  అనిల్ ఇనమడుగు దర్శక,నిర్మాతగా రూపొందిస్తున్న రొమాంటిక్  థ్రిల్లర్ చిత్రం “తీరం”. ఈ చిత్రం టైటిల్,  మోషన్ పోస్టర్ ను మే 30న హైదరాబాద్  ఫిలిం నగర్లోని దైవ సన్నిధానంలో చిత్ర యూనిట్ ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో  తీరం సినిమా హీరో మరియు దర్శకులు అనిల్ ఇనమడుగు, హీరోయిన్ క్రిష్టెన్ రవళి, సినెటేరియా అధినేత వెంకట్ బులెమోని, మై విలేజ్ షో అనిల్, అజయ్ సన్నపు, విజయం పన్నేరు, అజస్ జాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత అయిన అనిల్ ఇనమడుగు మాట్లాడుతూ- ‘ పూర్తి స్థాయి సంగీతం మరియు సస్పెన్స్ తో  కూడిన రొమాంటిక్  ప్రేమకథాచిత్రంగా తీరం సినిమాని రూపొందించాం.  సినిమా అంతా  ఒక హృద్యమైన…

‘ఊర్వశి’ మరింత వృద్ధి చెందాలి: సూపర్ స్టార్ కృష్ణ

తన పుట్టినరోజును పురస్కరించుకుని… తనపై ప్రత్యేక పాటను విడుదల చేసిన ‘ఊర్వశి ఓటిటి’ మరింతగా వృద్ధి చెందాలని సూపర్ స్టార్ కృష్ణ ఆకాంక్షించారు. “తెలుగు వీర లేవరా… దీక్షబూని సాగరా” అనే పంక్తులతో మొదలయ్యే ఓ ఉత్తేజభరిత గీతాన్ని.. ప్రముఖ దర్శకులు వీరు.కె స్వర సారధ్యం మరియు రచనలో.. ప్రముఖ సంగీత దర్శకులు-నటులు-దర్శకులు-గాయకులు ఆర్.పి.పట్నాయక్ ఆలపించారు. యువ గాయని మౌనిక గొంతు కలిపారు. ప్రముఖ ఓటిటి సంస్థ ఊర్వశి సౌజన్యంతో ఈ ప్రత్యేక గీతం రూపుదిద్దుకుంది. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని… ఆయన్ని స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఊర్వశి సిఇఓ తుమ్మలపల్లి రామసత్యనారాయణ… తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాప్తి చేసిన డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణగారికి.. పుట్టినరోజు కానుకగా.. ఆయనపై ఓ ప్రత్యేక పాటను రూపొందించే అవకాశం ఇచ్చిన ప్రముఖ నటులు-‘మా’…

పడుచు ప్రేమికుల ప్రణయ కథనం ‘లావణ్య విత్ లవ్ బాయ్స్’

‘ఎక్కడికి వెళ్తుందో మనసు’ అనంతరం ప్రముఖ గీత రచయిత, బహుముఖ ప్రతిభాశాలి డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన స్వచ్ఛమైన ప్రేమకథ ‘లావణ్య విత్ లవ్ బాయ్స్’. పావని టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రంలో యోధ-కిరణ్-సాంబ హీరోలు. ప్రఖ్యాత రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ, కాశీ విశ్వనాధ్, హేమసుందర్, వైభవ్, యోగి, భవాని ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ వినోదభరిత ప్రేమకథాచిత్రాన్ని ‘రాజ్యలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్’ పతాకంపై శరత్ చెట్టి (యూఎస్ఏ) సమర్పణలో శ్రీమతి రాజ్యలక్ష్మి.సి-నర్సింలు పటేల్ చెట్టి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 6 న ప్రముఖ ఓటిటి ఊర్వశి ద్వారా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి కథ-మాటలు-పాటలు-స్క్రీన్ ప్లే సైతం సమకూర్చిన చిత్ర దర్శకులు డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ మాట్లాడుతూ.. “ముందుగా మా “లావణ్య విత్ లవ్…

పేదలకు ఆహరం , సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన ‘బుజ్జిగాడు’ హీరోయిన్ సంజన

‘బుజ్జిగాడు’ హీరోయిన్ సంజన కరోనా కష్టకాలంలో ఆకలితో అలమటిస్తున్న పేదలకు ఆహారం, శాండల్ వుడ్ సినీ కార్మికుల కుటుంబాలకు తాను స్థాపించిన సంజన గల్రాని ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులను సహాయంగా పంపిణీ చేసారు హీరోయిన్ సంజన. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘కోవిడ్‌ భాదితులు మెరుగైన ఆరోగ్యంతో కోలుకోవాలని, వారిలో సానుకూలమైన ఆలోచనలను పెంపొందాలని, వారి జీవితాల్లో తిరిగి సంతోషం వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. తమ జీవితాలను, కుటుంబ సభ్యుల ఆరోగ్యాలను పణంగా పెట్టి పనిచేస్తున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌తో పాటుగా కోవిడ్‌ కట్టడిలో భాగస్వామ్యులైన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాస్కులు ధరించడం, ప్రతిరోజు శానిటైజ్‌ చేసుకోవడం, భౌతికదూరం పాటించడం..ఇలా కోవిడ్‌ నియంత్రణ చర్యలను పాటించడం వల్లనే ఈ ప్రపంచం కోవిడ్‌ మహమ్మారినుంచి బయటపడుతుంది. నేను స్థాపించిన సంజన గల్రాని ఫౌండేషన్ ద్వారా ఉడతా భక్తిగా మే…

విజయ్‌దేవ‌ర‌కొండ ‘గుండె క‌థ వింటారా’ ?

పాపుల‌ర్ క‌మెడియ‌న్ మ‌ధునంద‌న్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న చిత్రం ‘గుండె క‌థ వింటారా’. వంశీధ‌ర్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రాన్ని ట్రినిటి పిక్చర్స్ ప‌తాకంపై  క్రాంతి మంగ‌ళంప‌ల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ‌ధునంద‌న్ స‌ర‌స‌న స్వాతిస్ట కృష్ణన్‌, శ్రేయ న‌విలే హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుండి  `ఎంత బావుందో…‌` లిరిక‌ల్ సాంగ్‌ని విజ‌య్‌దేవ‌ర‌కొండ రిలీజ్‌చేసి చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ తెలిపారు. `ఎంత బావుందో..ప‌క్క‌నే ఉన్నా మ‌న‌సులో మాట చెప్ప‌లేకున్నా…గుప్పెడుగుండె త‌ట్టింది ఎవ‌రో నాకు చెప్పింది..పైకే చెప్ప‌నంటోంది హాయో మాయో అంతా కొత్త‌గా ఉంది ఐనా ఇదే బాగుంది బ‌హుశా ఎదురుప‌డ‌నంది` అంటూ సాగే ఈ సోల్ ఫుల్ మెలొడీకి  మ‌సాలా కాఫీ సంగీతం స‌మ‌కూర్చ‌గా కృష్ణ చైత‌న్య  సాహిత్యం…

శ్రీ వెన్నెల క్రియేషన్స్ కొత్త చిత్రం ప్రారంభం

sri vennela creations new movie launch

బేబీ లాలిత్య సమర్పణలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి.ఎమ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న నూతన చిత్రం దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. రాజీవ్, రంగస్థలం మహేష్, రాకేందు మౌళి, కంచెరపాలెం రాజు, టిఎన్ఆర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు కోటి సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఎమ్.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మా బ్యానర్ లో నిర్మించిన మొదటి సినిమా కళాపోషకులు విడుదలకు సిద్దంగా ఉంది. దర్శకుడు శివ వరప్రసాద్ చెప్పిన పాయింట్ నచ్చడంతో ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాను. ఇది మా బ్యానర్ లో వస్తోన్న సెకండ్ ప్రాజెక్ట్. కోటి గారు మా సినిమాకు సంగీతం అందించడం సంతోషంగా ఉంది, దసరా సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అవ్వడం ఆనందంగా ఉంది. ఎక్కడా రాజీ పడకుండా…

ఆదాశ‌ర్మ క్వ‌శ్చ‌న్ మార్క్ రెడీ అవుతోంది

adah sharma question mark movie

క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోన్న స‌మ‌యంలో షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం? క్వ‌శ్చ‌న్ మార్క్. హీరోయిన్ ఓరియెంటెడ్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆదాశ‌ర్మ మెయిన్ లీడ్ లో న‌టించింది. సంజ‌య్, అభ‌య్, భానుశ్రీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకం పై విప్రా దర్శకత్వం లో గౌరీ కృష్ణ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఆఖ‌రి ద‌శ‌లో ఉన్నాయి. ఇటీవ‌ల మినిస్ట‌ర్ త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ చేతుల మీదుగా లాంచ్ చేసిన పోస్ట‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. త్వ‌ర‌లో ఈ చిత్రంలోని పాట‌ను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా నిర్మాత గౌరీ కృష్ణ మాట్లాడుతూ “మా శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై ఆదా శర్మ హీరోయిన్…