– తెలుగు నిర్మాతలమండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ విడుదల చేసిన “లక్కీ స్టార్’ ప్రచార చిత్రం!! – రాధికా కుమారస్వామి సమర్పణలో ‘లక్కీ స్టార్’గా వస్తున్న పాన్ ఇండియా స్టార్ యష్ – సెన్సార్ పూర్తి-త్వరలో విడుదల!! కె.జి.ఎఫ్-1, కె.జి.ఎఫ్-చాప్టర్2 చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యష్ నటించగా… కన్నడలో ఘన విజయం సాధించిన “లక్కీ” అనే చిత్రం తెలుగులో “లక్కీ స్టార్”గా రానుంది. కన్నడలో ఈ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నటి రాధికా కుమార్ స్వామి స్వయంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు “లక్కీ స్టార్” చిత్రాన్ని తీసుకువస్తున్నారు. రాధికా కుమారస్వామి సమర్పణలో శ్రీదుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై రవిరాజ్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. డా.సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్ సరసన టాప్ హీరోయిన్ రమ్య నటించింది. లవ్-కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్…
Category: MOVIE REVIEWS
Jeevitha Rajasekhar secures victory in ‘Shekar’ row
‘Shekar’ was released in theatres on May 20. It stars Rajasekhar as the hero. Jeevitha Rajasekhar has directed it. On Sunday, owing to a litigation initiated by financier Parandhama Reddy in a city civil court, its screenings across theatres were stayed. In this regard, the advocate from Jeevitha’s side made a strong argument in favour of the director and the film in the court. It has been concluded that the court did not intend to stay the screening of ‘Shekar’ in theatres. Some forces deliberately obstructed the screening of the…
‘శేఖర్’ సినిమా వివాదంలో జీవితా రాజశేఖర్ గెలుపు
రాజశేఖర్ కథానాయకుడిగా ఆయన సతీమణి జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించిన ‘శేఖర్’ గత శుక్రవారం విడుదలైంది. అయితే, ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వేసిన కేసు కారణంగా సినిమా ప్రదర్శన నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో జీవితా రాజశేఖర్, శేఖర్ చిత్రబృందం సభ్యులకు అనుకూలంగా కోర్టులో న్యాయమూర్తి మాట్లాడినట్టు తెలుస్తోంది. ‘శేఖర్’ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తామెప్పుడూ చెప్పలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా సినిమా ప్రదర్శనకు ఆటంకం కలిగించారు. అయితే, కోర్టు సినిమా ప్రదర్శనకు ఎటువంటి అభ్యంతరం తెలపలేదు. శేఖర్ సినిమాను నిరభ్యంతరంగా ప్రదర్శించవచ్చు. జీవితా రాజశేఖర్, నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి తరపు న్యాయవాదులు మంగళవారం విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఘనంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు
యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బర్రె నరేష్ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో అర్ధరాత్రి 12గంటలకు ఇండియా గేట్ వద్ద తెలంగాణ రాష్ట్ర స్టార్ క్యాంపానర్ భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ఎలిమినేట్ సురేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంగ కిరణ్ ఆలేరు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కర్రే అజయ్ ఆలేరు యూత్ మాజీ మండల అధ్యక్షుడు ఊట్కూరి సురేష్ గౌడ్ , మహేష్. యువజన కాంగ్రెస్ తుర్కపల్లి, మండల ప్రధాన కార్యదర్శి నల్ల బాలకృష్ణ. రవితేజ అసెంబ్లీ అధ్యక్షులు పాల్గొన్నారు
సీతారామ శాస్త్రి గారి అక్షరాలు నిత్య చైతన్య కిరణాలు : పవన్ కళ్యాణ్
కవి తన రచనల ద్వారా అమరత్వం పొందుతాడు. తను భౌతికంగా లేకపోయినా తను సమాజానికి అందించిన అక్షర కిరణాల ద్వారా స్ఫూర్తినిస్తాడు. పంచ భూతాలలో కలసిపోయినా రాబోయే తరానికి దిశానిర్దేశం చేస్తూనే ఉంటారు. అలాంటి ఒక గొప్ప కవి శ్రీ ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి గారు. ఆయన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ నమస్సుమాంజలి. శ్రీ సీతారామ శాస్త్రి గారి జయంతి సందర్భంగా విడుదలైన ‘సిరివెన్నెల సీతారామ శాస్త్రి సమగ్ర సాహిత్యం’ మొదటి సంపుటి చూశాక – ఆ అక్షర తపస్విని మొదటిసారి ‘రుద్రవీణ’ సినిమా సమయంలో కలసిన సందర్భం గుర్తుకు వచ్చింది. అన్నయ్య చిరంజీవి గారు నటించిన ఈ సినిమాకు నాగబాబు అన్నయ్య నిర్మాతగా ఉన్న ఈ చిత్రానికి నేను సహ నిర్మాతగా ఉంటూ నిర్మాణంలో పాలుపంచుకొన్నాను. ఆ సందర్భంలో శ్రీ శాస్త్రి గారితో భేటీ ఆయ్యేవాణ్ణి. ఆ…
నాని, వివేక్ ఆత్రేయ, మైత్రీ మూవీ మేకర్స్ ‘అంటే.. సుందరానికీ’ థర్డ్ సింగిల్ ‘రంగో రంగా’ లిరికల్ వీడియో విడుదల
నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికి’. నజ్రియా ఫహద్ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. సినిమా కథ చెప్పడంలో దర్శకుడు వివేక్ ఆత్రేయది ప్రత్యేకమైన శైలి. కథ చెప్పడంలోనే ఆయనకి మంచి సంగీతం అభిరుచి కూడా వుంది. ఆయన సినిమాల్లోని పాటలు డిఫరెంట్‌గా ఉంటూ ఒక్కో పాట డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ కి కనెక్ట్ అవుతుంది. వివేక్ సాగర్ స్వరపరిచిన ‘అంటే.. సుందరానికీ’ ఫస్ట్ సింగల్ పంచెకట్టు, సెకెండ్ సింగల్ ఎంత చిత్రం పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ చిత్రం నుండి మూడవ సింగిల్ ‘రంగో రంగా’ పాట లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాట కథలో…
‘శరపంజరం ‘చిత్రంలోని మొదటి పాటను విడుదల చేసి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్
గంగిరెద్దుల అబ్బాయి జోగిని అమ్మాయి ప్రేమలో పడితే ఎం జరిగింది. ఆఊరి దొర మరియు గ్రామ ప్రజలు వీరిపై ఎలాంటి వ్యతిరేకత కనపరచారు అనే పల్లెటూరు నేపధ్యంలో సాగే కథాంశంతో వస్తున్న చిత్రమే “శరపంజరం” .దోస్తాన్ ఫిలిమ్స్ బ్యానర్ పై నవీన్ కుమార్ గట్టు, లయ జంటగా నవీన్ కుమార్ గట్టు దర్శకత్వంలో టీ. గణపతి రెడ్డి ,మల్లిక్ ఎం వీ కే నిర్మిస్తున్న ఈ చిత్రం లోని మొదటి పాటను, మరియు, ఫస్ట్ గ్లిమ్స్ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు మొదటి పాటను విడుదల చేయగా..సంగీత దర్శకుడు ఆర్. పి.పట్నాయక్ ఫస్ట్ గ్లిమ్స్ ను విడుదల చేశారు. మామిడాల హరికృష్ణ…
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ
ఈరోజు మాజీ మంత్రివర్యులు స్టార్ కాంపెయిన్ చైర్మన్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలను జూబ్లీహిల్స్లోని స్వగృహం లో యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చం శాలువాతో సన్మానం చేయడం కేక్ కటింగ్ లో పాల్గొనడం జరిగింది. ఆయురారోగ్యాలతో రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి, కల్లూరి రామచంద్రారెడ్డి ఎల్లముల సంజీవరెడ్డి స్టేట్ మహిళ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి విద్యా, సెక్రెటరీ పావని సుధాకర్ మొదలగు వారు పాల్గొన్నారు
విలక్షణ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ నిర్మాతగా ‘యానం’
విలక్షణ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ నిర్మాతగా కేఎస్ఐ సినిమా అన్‌లిమిలెట్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న చిత్రం యానం. షేక్స్‌పియర్ రచనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి కరుణాకరణ్ దర్శకుడు. ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో కేఎస్ఐ సినిమా అన్‌లిమిలెట్ బ్యానర్ లోగోను ప్రముఖ నిర్మాత బన్నీవాసు, `యానం` చిత్ర టైటిల్ లోగోను ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా… ప్రముఖ నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ – “శ్రీకాంత్ అయ్యంగారు నిర్మిస్తున్న ఫస్ట్‌మూవీ `యానం` మరియు కేఎస్ఐ సినిమా అన్‌లిమిటెడ్ బ్యానర్‌కు ఆల్ ది బెస్ట్. ఈ రోజుల్లో ఒక సినిమా తీయాలంటే చాలా ధైర్యం కావాలి. కరోనా తర్వాత సమీకరణాలు మారిపోయాయి. ప్రతి ఒక్కరు జీరో నుండి మళ్లీ నేర్చుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సినిమా మొదలు పెట్టడం…
విశాల్ – ఎ.వినోద్ కుమార్ – రానా ప్రొడక్షన్స్ పాన్ ఇండియా చిత్రం ‘లాఠీ’ ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల
యాక్షన్ హీరో విశాల్ కధానాయకుడిగా ఎ.వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘లాఠీ’. హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విశాల్ సరసన ఈ చిత్రంలో సునైనా కథానాయికగా నటిస్తుంది. తాజాగా ఓ పవర్ ఫుల్ పోస్టర్ ద్వారా లాఠీ విడుదల తేదీని ప్రకటించారు నిర్మాతలు. ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీగా విడుదల కానుంది. రిలీజ్ డే ఎనౌన్స్ మెంట్ పోస్టర్ లో విశాల్ యాక్షన్ లుక్ ఆకట్టుకుంది. ఒంటినిండా గాయాలు, రక్తం కారుతున్నా నవ్వుతూ కనిపించడం విశాల్ పాత్రలోని హై ఇంటెసిటీని తెలియజేస్తుంది. సమాజంలో మార్పు తెచ్చే శక్తి లాఠీకి వుంది. విశాల్ ఆ ‘లాఠీ’ తో సమాజంలో ఎలాంటి మార్పులకు నాంది పలికారో అన్నది ఆసక్తికరం.…
