జిన్నాకి గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ!

జిన్నా' కి గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ!

విష్ణు మంచు తాజా చిత్రం ‘జిన్నా’. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యింది. పాయల్ రాజ్ ఫుత్, సన్నీలియోన్ ప్రధాన తారలుగా నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్ర, రఘుబాబు సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. నటినటులతో పాటు సాంకేతిక వర్గం విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వడం లేదు విష్ణు మంచు. ముఖ్యంగా కొరియోగ్రాఫర్స్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఇప్పటికే ప్రభుదేవా ఓ పాటకు కొరియోగ్రఫీ సమకూర్చగా, ప్రముఖ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ‘జిన్నా’ లోని ఓ పాటకు కొరియోగ్రఫీ అందించారు. విష్ణు మంచు, పాయల్ రాజ్ ఫుత్, సన్నీలియోన్ కాంబినేషన్ లో తెరకెక్కిన పార్టీ సాంగ్ కి గణేష్ ఆచార్య స్టెప్స్ సమకూర్చారు. ఎంగేజ్ మెంట్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ…

అద్భుతమైన విజువల్స్, అదిరిపోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటున్న నిఖిల్, చందూ మొండేటి ‘కార్తికేయ 2’ ట్రైలర్

అద్భుతమైన విజువల్స్, అదిరిపోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటున్న నిఖిల్, చందూ మొండేటి ‘కార్తికేయ 2’ ట్రైలర్

ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ‌ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. సముద్రం దాచుకున్న అతిపెద్ద రహస్యం.. ఈ ద్వారకా నగరం అంటూ హీరో నిఖిల్ వాయిస్ తో వచ్చిన మోషన్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది. క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొన‌సాగిస్తూ విజ‌యాలు సొంతం చేసుకుంటున్న‌ క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. అద్భుతమైన విజువల్స్, అదిరిపోయే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ‘శాంతను ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను సమిధను మాత్రమే.. ఆజ్యం…

అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌లో `అరి` చిత్రం టైటిల్ లోగో ఆవిష్క‌రణ

అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌లో `అరి` చిత్రం టైటిల్ లోగో ఆవిష్క‌రణ

త‌న మొద‌టి మూవీ`పేప‌ర్ బాయ్‌`తో హార్ట్ ట‌చింగ్ చిత్రంగా హిట్ కొట్టిన జ‌య‌శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో , ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌లు శేషు మారం రెడ్డి, శ్రీ‌నివాస్ రామిరెడ్డి సంయుక్తంగా , ఆర్వి రెడ్డి, సమర్పణ లో `అరి` సినిమా ని నిర్మిస్తున్నారు. అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, సాయికుమార్‌, వైవాహ‌ర్ష‌, శుభ‌లేఖ సుధాక‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగో విడుద‌ల‌యింది. శుక్ర‌వారంనాడు గ‌చ్చిబౌలిలో రేడిస‌న్ హోట‌ల్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో హుజూరాబాద్ ఎం.ఎల్.ఎ. శానంపూడి సైదిరెడ్డి, అఖండ నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి సంయుక్తంగా ఆవిష్క‌రించారు. అనంత‌రం ఎం.ఎల్.ఎ. సైదిరెడ్డి మాట్లాడుతూ, అంద‌రికీ పేరుపేరునా న‌మ‌స్కారాలు. ర‌వీంద‌ర్‌రెడ్డి చేసిన మూవీకి నేనూ వ‌చ్చాను. ఈ సినిమాను టాలెంటెడ్ న‌టీన‌టులు, సాంకేతిక సిబ్బంది అంద‌రూ క‌లిసి చేశారు. నిర్మాత‌లు బిజినెన్ ఎంట‌ర్‌ప్రెన్యూర్స్‌. వారు సినిమా చేస్తే ఎలా వుంటుంద‌నే ప్ర‌యోగం చేశారు.…

హీరో సాయిరాం శంకర్ సినిమా ‘వెయ్ దరువెయ్’ ప్రారంభం

హీరో సాయిరాం శంకర్ సినిమా 'వెయ్ దరువెయ్' ప్రారంభం

శంకర్ పిక్చర్స్ సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయి రామ్ శంకర్, యషా శివకుమార్ జంటగా నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పొత్తూరు నిర్మిస్తున్న చిత్రం “వెయ్ దరువెయ్” ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన హీరో శర్వానంద్ హీరో, హీరోయిన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా,హీరో అల్లరి నరేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.హీరో విశ్వక్ సేన్ గౌరవ దర్శకత్వం వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో.. హీరో సాయి రామ్ శంకర్ మాట్లాడుతూ..ఈ కార్యక్రమానికి వచ్చిన హీరోలు శర్వానంద్, అల్లరి నరేష్, విశ్వక్ సేన్ లకు పెద్దలకు ధన్యవాదములు.”యస్. ఆర్ కల్యాణ మండపం” తర్వాత…

నాగ చైతన్య ద్విభాషా చిత్రం ఘనంగా ప్రారంభం

నాగ చైతన్య ద్విభాషా చిత్రం ఘనంగా ప్రారంభం

వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న హీరో నాగ చైతన్య తన 22వ సినిమా కోసం ఏస్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చేతులు కలిపారు. తెలుగు, తమిళ భాషల్లో రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఫస్ట్-క్లాస్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ చిత్రం గ్రాండ్‌గా రూపుదిద్దుకోనుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించనున్నారు. కృతిశెట్టి ఈ చిత్రంలో నాగ చైతన్యకి జోడిగా నటిస్తున్నారు. నాగ చైతన్య, వెంకట్ ప్రభు, కృతి శెట్టి ఈ ముగ్గురి క్రేజీ కాంబినేషన్ లో తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకులైన తండ్రీ కొడుకులు ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం మరో విశేషం. వారిద్దరు కలిసి సంగీతం…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లాప్ తో గ్రాండ్ గా ప్రారంభమైన విశ్వక్ సేన్ చిత్రం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లాప్ తో గ్రాండ్ గా ప్రారంభమైన విశ్వక్ సేన్ చిత్రం

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడి గా ఐశ్వర్య అర్జున్‌ కథానాయిక గా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా రచయిత, నిర్మాత, దర్శకుడిగా వ్యవహరిస్తున్న చిత్రం గ్రాండ్ గా ప్రారంభమైయింది. అర్జున్ సొంత బ్యానర్ శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ నెం 15లో స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ తెలుగులో కథానాయికగా పరిచయం అవుతున్నారు. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరై క్లాప్ కొట్టి చిత్ర యూనిట్ కి బెస్ట్ విశేష్ అందించారు. తొలి షాట్ కి వెటరన్ దర్శకులు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా, ప్రకాష్ రాజ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మంచు విష్ణు స్క్రిప్ట్ ని హ్యాండోవర్ చేశారు. వీరితో పాటు…

ఘనంగా ‘చోర్ బజార్’ ప్రీ రిలీజ్ వేడుక

chor bazar pre relese function

ఆకాష్ పురి హీరోగా నటించిన సినిమా చోర్ బజార్. గెహనా సిప్పీ నాయికగా నటించింది. దర్శకుడు జీవన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. ఈనెల 24న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో విశ్వక్ సేన్, నిర్మాత బండ్ల గణేష్, హీరో సాయిరామ్ శంకర్, పూరీ జగన్నాథ్ భార్య లావణ్య, దర్శకుడు పరశురామ్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. దర్శకుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ…జీవన్ దర్శకుడిగా సినిమా బాగా చేస్తావని నీ మీద నమ్మకం ఉంది. మా అబ్బాయితో మంచి సినిమా చేయ్ అని చెప్పి ఆకాష్ ను నాతో పంపించారు పూరి జగన్నాథ్. ఆయన మాట నిలబెట్టుకుంటానని…

‘సీతారామ‌పురంలో ఒక ప్రేమ జంట’ టీజ‌ర్ లాంచ్‌

seetaramapuramlo oka prema janta

శ్రీ ధ‌న‌ల‌క్ష్మి మూవీస్ ప‌తాకంపై ఎమ్.విన‌య్ బాబు ద‌ర్శ‌క‌త్వంలో బీసు చంద‌ర్ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం `సీతారామ‌పురంలో ఒక ప్రేమ జంట‌`. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ ప్రేమ‌క‌థా చిత్రంతో ర‌ణ‌ధీర్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. నందిని రెడ్డి హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతోంది. ఈ రోజు ప్ర‌సాద్ ల్యాబ్స్ లో ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్రమం మినిస్ట‌ర్ శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మినిస్ట‌ర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…“పాట‌లు, టీజ‌ర్ చూశాక ఇదొక చ‌క్క‌టి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ చిత్ర‌మని అర్థ‌మ‌వుతోంది. అంద‌రూ కొత్త‌వారు న‌టించిన ఈ చిత్రం విజ‌య‌వంతం కావాల‌ని కోరుకంటున్నా. ఇంత‌కు ముందు ఆ న‌లుగురే నిర్మాత‌లు, వాళ్లే హీరోలు, వాళ్ల‌వే థియేట‌ర్స్ అన్న‌ట్టు ఉండేది. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మారింది. కొత్త‌వాళ్లు…

మాస్ మహారాజా రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ జూలై 29న విడుదల

మాస్ మహారాజా రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' జూలై 29న విడుదల

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదీలావుండగా ఈరోజు చిత్ర నిర్మాతలు సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ జూలై 29న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. సినిమా థియేట్రికల్ విడుదలకు దాదాపు ఒక నెల సమయం ఉంది. రానున్న రోజుల్లో భారీ ప్రమోషనల్ క్యాంపెయిన్‌ కు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది. రిలీజ్ డేట్ పోస్టర్ టెర్రిఫిక్ గా వుంది. రవితేజ తీక్షణంగా ఆలోచిస్తూ సీరియస్ గా చూస్తున్న ఇంటెన్స్ లుక్ ఆసక్తికరంగా వుంది. హై వోల్టేజ్…

‘డ్యాన్స్ ఐకాన్‌’ అనే సరికొత్త షోతో వస్తున్నారు ఆహా, ఓక్‌ ఎంటర్‌టైన్మెంట్ : 22 జూన్‌ నుంచి ప్రారంభం కానున్న ఆడిషన్స్

'డ్యాన్స్ ఐకాన్‌' అనే సరికొత్త షోతో వస్తున్నారు ఆహా, ఓక్‌ ఎంటర్‌టైన్మెంట్ - 22 జూన్‌ నుంచి ప్రారంభం కానున్న ఆడిషన్స్

నెమలికి నేర్పిన నడకలివి అని ఆనాడు పాడిన, రారా రమ్మంటున్న రణరంగంలో సిద్ధంగున్నా చావో రేవో తేలాలిపుడే డ్యాన్స్ అని ఈ మధ్య పాడినా, డ్యాన్స్ అనే పదం వినపడగానే ప్రతి ఒక్కరికీ వారిలో ఉన్న ఒక డ్యాన్సర్‌ బయటికొస్తారు. మరి మీలో ఎవరైనా అలాంటి డ్యాన్సర్‌ ఉంటే, ఆ ప్రతిభ మీకుంటే ఆహా, ఓక్‌ ఎంటర్‌టైన్మెంట్‌తో కలిసి సమర్పిస్తున్న ‘డ్యాన్స్ ఐకాన్‌’ అనే షో మీ కోసమే. మీ ప్రతిభకు మా వేదిక శిరస్సు వంచి ఆహ్వానిస్తుంది. ఇంకా ఎందుకు ఆలస్యం, ఆడిషన్స్ ఇచ్చేయండి, డ్యాన్స్ ఐకాన్‌ టైటిల్‌ను గెలుచుకోండి. జూన్‌ 22 నుంచి ప్రారంభం కానున్న ఈ షో డిజిటల్‌ ఆడిషన్స్ జులై 10 వరకు కొనసాగుతాయి. మీ వయసు 5 నుంచి 50 మధ్యలో ఉన్నట్టయితే, మీరు తెలుగు రాష్ట్రాలకి చెందిన వారైతే,…