గౌడ కులస్తుల మనోభావాలని అర్ధం చేసుకుని మా ‘ధర్మపురి’ ట్రైలర్ లో అభ్యంతకర షాట్ ని తొలగించాం : ‘ధర్మపురి’ టీమ్

గౌడ కులస్తుల మనోభావాలని అర్ధం చేసుకుని మా 'ధర్మపురి' ట్రైలర్ లో అభ్యంతకర షాట్ ని తొలగించాం : 'ధర్మపురి' టీమ్
Spread the love

అందరికి నమస్కారం… గౌడ కుల సంఘం పెద్దలకు , గీత కార్మిక సహోదరులకు మా యొక్క ‘ధర్మపురి’ మూవీ టీం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. గత 2 రోజులుగా మాయొక్క ధర్మపురి మూవీ లోని ట్రయిలర్ లో గౌడన్న ముఖము మీద కల్లు పోయడం మీద గౌడ సంఘాల పెద్దలు , సోదరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మొదటగా ఆ యొక్క సన్నివేశం మీమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమాపణలు కోరుతున్నాము. ఆ సన్నివేశం ట్రైలర్ లో, మరియు సినిమా లో తొలగించడం జరిగింది అని మీకు తెలియజేస్తున్నాము. మరియు మిగతా సినిమా లో అన్ని సన్నివేశాలు గీత కార్మికుల, గౌడన్నల వృత్తి గౌరవాన్ని పెంచే విధంగా మా సినిమా ఉంటుంది. దయచేసి మన గౌడ సంఘాల పెద్దలు, గీత కార్మిక సహోదరులు అందరూ… కొత్తగా వస్తున్న మా సినిమా ను , మమ్మల్ని అందరూ ఆశీర్వదించాలని కోరుతూ….
BHASKARA GROUP OF MEDIA….
DHARMAPURI MOVIE TEAM….
HYDERABAD

Related posts

Leave a Comment