పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రాశి ఖన్నా – శ్రీలీల హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రమే ‘ఉస్తాద్ భగత్ సింగ్’. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఈ ఉగాది కానుకగా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ మాత్రం అభిమానుల్లో మంచి బజ్ ని పెంచింది. ఇక ఈ ట్రైలర్ పై మన టాలీవుడ్ స్టార్స్ నుంచి కూడా ఫీడ్ బ్యాక్ వచ్చింది. మరి లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమా ట్రైలర్ పై తమా స్పందన తెలియజేయడం వైరల్ గా మారింది. మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది.. ట్రైలర్ అదిరింది.. ఉగాదికి “ఉస్తాద్ భగత్ సింగ్”…
