మే 27న వైష్ణవ్ తేజ్ ‘రంగ రంగ వైభ‌వంగా’ విడుదల

RangaRanga-Vaibhavangaa

ఉప్పెన సినిమాతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన యువ క‌థానాయ‌కుడు వైష్ణ‌వ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘రంగ రంగ వైభవంగా’. కేతికా శర్మ హీరోయిన్. బాపినీడు సమర్పణలో శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై గిరీశాయ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ ఏడాది వేస‌వి కానుక‌గా మే 27న `రంగ రంగ వైభ‌వంగా` సినిమాను విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌కు విప‌రీత‌మైన స్పంద‌న వ‌స్తోంది. సేద దీరుతున్న కేతిక శ‌ర్మ వైపు త‌దేకంగా చూస్తున్న వైష్ణ‌వ్ తేజ్ లుక్ యూత్‌ని అట్రాక్ట్ చేస్తోంది. టైటిల్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచే ప్రేక్ష‌కుల్లో విపరీత‌మైన క్రేజ్ ఉంది ఈ సినిమా మీద‌. ఆడియ‌న్స్ ఎక్స్ పెక్టేష‌న్స్ కి ఏ మాత్రం త‌గ్గ‌కుండా సినిమా…