మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్లోని శిల్ప కళా వేదికలో అంగరంగ వైభవంగా జరిగాయి. రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో వందలాది రామ్ చరణ్ అభిమానులు పాల్గొని కేరింతలు కొట్టారు. రెండేళ్ల పాటు జన్మదిన వేడుకలకు దూరంగా ఉండటంతో ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా రామ్ చరణ్ నటించిన సినిమాల్లోని పాటలకు డాన్స్ పెర్ఫార్మెన్స్ లను అభిమానులు ఆస్వాదించారు. ఇక ఆ తర్వాత బ్లడ్ డోనర్స్ ను, బ్లడ్ క్యాంప్ ఆర్గనైజర్స్ ను చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ మాధవి, చిరంజీవి స్నేహితుడు శేఖర్ లు సత్కరించారు. అలాగే రామ్ చరణ్ జన్మదిన కానుకగా ఒక స్పెషల్ సాంగ్ చేసిన చక్రి సోదరుడు, మ్యూజిక్ డైరెక్టర్ మహిత్ నారాయణ్ గారికి, రామ్ చరణ్…