నిర్మాత కాట్రగడ్డ మురారి ఇకలేరు

katragadda murari no moer

ఎన్నో గొప్ప సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి (78) కన్నుమూశారు. దీనితో తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. గత రాత్రి చెన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన ‘యువ చిత్ర ఆర్ట్స్’ పేరుతో బ్యానర్ స్థాపించి ‘సీతామాలక్ష్మి’, ‘గోరింటాకు’, ‘త్రిశూలం’, ‘అభిమన్యుడు’, ‘సీతారామ కల్యాణం’, ‘శ్రీనివాస కల్యాణం’, ‘జానకి రాముడు’, ‘నారీనారీ నడుమ మురారి’ వంటి హిట్ సినిమాలు నిర్మించారు. శనివారం రాత్రి చెన్నైలోని తన నీలాంగరై నివాసంలో తుది శ్వాస విడిచారు. పలు సంచలనాత్మక చలన చిత్రాలను ఆయన నిర్మించారు. యువ చిత్ర బ్యానర్‌పై కాట్రగడ్డ మురారీ నిర్మించిన పలు సినిమాలు విజయాలు సొంతం చేసుకున్నాయి. విజయవాడ మొగల్రాజపురానికి చెందిన మురారి ఎంబీబీఎస్ చదువుతున్న రోజుల్లో సినిమాలు చూసి వాటిపై సమీక్షలు, వ్యాసాలు రాసేవారు. ఎంబీబీఎస్ చివరి…