శ్రీ మణికంఠ సినీ క్రియేషన్స్ పతాకంపై అభిజిత్ రామ్, శ్రీజ జంటగా కిరణ్ తిమ్మల దర్శకత్వంలో రాము, మురళి, పరమేష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `గీత` (మన కృష్ణగాడి ప్రేమకథ ట్యాగ్ లైన్). ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ రోజు ఫిలించాంబర్ లో ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ…“మోషన్ పోస్టర్ చాలా బావుంది. హీరో హీరోయిన్ జంట కూడా చూడ ముచ్చటగా ఉంది. ఇటీవల కాలంలో కొత్త కంటెంట్ తో కొత్త వాళ్లు చేసే చిన్న చిత్రాలు బాగా ఆడుతున్నాయి. ఆ కోవలో ఈ చిత్రం కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నా. కంటెంట్ బాగుంటే థియేటర్స్…