స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వేణు ఎల్దండి దర్శకత్వంలో రూపొందిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రేక్షకుల హృదయాలతో పాటు విమర్శకులు ప్రశంసలు అందుకున్న ‘బలగం’ సినిమా థియేటర్స్‌లో కలెక్షన్స్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేయటమే కాకుండా ఓటీటీలోనూ రికార్డ్స్ క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అంతర్జాతీయంగా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. తాజాగా ‘బలగం’ సినిమా ఓ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఒకటి రెండు కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లోని ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శింపబడి 100కి పైగా అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాలను హృద్యంగా తెరకెక్కించిన తీరు అంతర్జాతీయంగా ప్రేక్షకుల మెప్పును పొందేలా చేసింది. ఇందులో నటీనటులు…