సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆవిష్కరించిన ‘ప్రేమదేశపు యువరాణి’ మోషన్ పోస్టర్

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆవిష్కరించిన ‘ప్రేమదేశపు యువరాణి’ మోషన్ పోస్టర్

A.G.E క్రియేషన్స్, S2H2 ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యామిన్ రాజ్, విరాట్ కార్తీక్ , ప్రియాంక రెవరి హీరోహీరోయిన్లుగా సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో.. ఆనంద్ వేమూరి, హరి ప్రసాద్. సిహెచ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘మోషన్ పోస్టర్ చాలా బాగుంది. ప్రేమలో సరికొత్త యాంగిల్‌ని ఈ చిత్రంలో టచ్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఎంటైర్ యూనిట్‌కి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’’ అని అన్నారు. చిత్ర నిర్మాతలలో ఒకరైన వేమూరి ఆనంద్ మాట్లాడుతూ.. ‘‘ముందుగా మా చిత్ర మోషన్ పోస్టర్‌ని విడుదల చేసిన దర్శకుడు అనిల్ రావిపూడిగారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు. మోషన్ పోస్టర్ ఆయనకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా కూడా మంచి కంటెంట్‌తో తెరకెక్కిస్తున్నాము.…

సుధీర్ బాబు హీరోగా వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి ‘హంట్’ టైటిల్ ఖరారు

sudheerbabu movie news

సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పోలీస్ నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘హంట్’ టైటిల్ ఖరారు చేసినట్లు ఈ రోజు వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ “సుధీర్ బాబు ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌ రోల్‌లో కనిపించనున్న చిత్రమిది. ఆయనతో పాటు శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ భరత్ పోలీస్ ఆఫీసర్లుగా చేస్తున్నారు. ఈ ముగ్గురూ క్లోజ్ ఫ్రెండ్స్. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. చాలా స్టైలిష్ ఫిల్మ్. ఇప్పటి వరకు వచ్చిన సుధీర్ బాబు సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సులు చాలా సహజంగా, కొత్త అనుభూతి ఇచ్చేలా ఉంటాయి. కనిపించని శత్రువు కోసం జరిపే వేట ఈ సినిమా ప్రధాన కథాంశం.…

శివారెడ్డి-అమిత్ తివారి హీరోలుగా “రెంట్ – నాట్ ఫర్ సేల్”

శివారెడ్డి-అమిత్ తివారి హీరోలుగా "రెంట్ - నాట్ ఫర్ సేల్"

తనదైన మిమిక్రీతో ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు ప్రజల పొట్టలు చెక్కలు చేసే ప్రముఖ నటుడు శివారెడ్డి, అమిత్ తివారి, వనితారెడ్డి, మనీషాశ్రీ, చైతన్య ప్రియ ముఖ్య తారాగణంగా రాజ్ కుమార్ ఎంటర్టైన్మెంట్స్ – రామ్ నాథ్ ముదిరాజ్ మూవీస్ పతాకాలపై రఘువర్ధన్ రెడ్డి దర్శకత్వంలో చందక రాజ్ కుమార్ – సి.హెచ్.రామ్ నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్న హర్రర్ రొమాంటిక్ థ్రిల్లర్ “రెంట్”. “నాట్ ఫర్ సేల్” అన్నది ఉప శీర్షిక. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ విభిన్న కథాచిత్రం గోవా, దేవఘడ్ తదితర ప్రాంతాల్లో మూడో షెడ్యూల్ జరుపుకోనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివారెడ్డి, అమిత్ తివారి, వనితారెడ్డి, మనీషాశ్రీ, చైతన్యప్రియ, దర్శకుడు రఘువర్థన్ రెడ్డి, నిర్మాతలు చందక రాజ్ కుమార్, సి.హెచ్.రామ్ నాథ్, సినిమాటోగ్రాఫర్ హజరత్ (వలి),…

‘రంగ రంగ వైభవంగా’ ట్రైల‌ర్ విడుదల : సెప్టెంబ‌ర్ 2న సినిమా విడుదల

ranga ranga vaibhavanga trailer relese

‘ఉప్పెన’ సినిమాతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన యంగ్ హీరో పంజా వైష్ణ‌వ్ తేజ్ కథానాయకుడిగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో.. తమిళంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ ద‌ర్శ‌కుడిగా ప్రముఖ సీనియర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘రంగ రంగ వైభ‌వంగా’. కేతికా శ‌ర్మ హీరోయిన్‌. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 2న గ్రాండ్‌గా విడుద‌ల చేస్తున్నారు. మంగ‌ళ‌వారం సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో… నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ పెయిర్ చక్కగా ఉంది. వైష్ణ‌వ్ తేజ్ సినిమాలో చాలా హ్యాండ్‌స‌మ్‌గా ఉన్నాడు. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంద‌ని భావిస్తున్నాను’’ అన్నారు. మెగా సెన్సేష‌న్ వైష్ణ‌వ్ తేజ్ మాట్లాడుతూ ‘‘ట్రైల‌ర్‌ను చూస్తున్న‌పుడు ఎంత…

The Lord of the Rings: The Rings of Power Final Trailer Released Ahead of Series Premiere

The Lord of the Rings: The Rings of Power Final Trailer Released Ahead of Series Premiere

As the final trailer releases, Galadriel (Morfydd Clark) prepares Middle Earth for the evil rising. Says: Choose not the path of fear, but that of faith The new two-minute-and-36-second trailer highlights the epic expanse of Middle-earth in its Second Age, and reveals how Tolkien’s legendary and beloved characters will come together against all odds and across great distances to guard against the feared reemergence of evil to Middle-earth. Fates collide and disparate characters are tested in the face of impending evil in this glimpse into the long-awaited new series. The…

చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఘనంగా మెగాస్టార్ బర్త్ డే వేడుకలు

megasta chiru birthday celebreations

తెలుగు చిత్రసీమలో మెగాస్టార్ చిరంజీవి అనే పేరుకున్న ప్రస్థానం వేరు. సినీనటుడిగా ఆయనకు అభిమానుల గుండెల్లో ఎంతటి క్రేజ్, ప్రేమాభిమానాలు ఉన్నాయో.. ఒక మంచి మనిషిగా ప్రపంచం ఆయనకిచ్చే గౌరవమర్యాదలు కూడా ఎల్లప్పుడూ గొప్పస్థాయిలోనే ఉంటాయి. టాలీవుడ్‌లో మెగాస్టార్ అంటే.. ఫ్యాన్స్‌లో వచ్చే ఉత్సాహాన్ని, ఊపును ఎవ్వరూ ఆపలేరు. అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసే పేరే చిరంజీవి అలియాస్ కొణిదెల శివశంకర వరప్రసాద్. ప్రపంచానికి మెగాస్టార్‌గా.. అభిమానులకు అండగా నిలిచే అన్నగా.. ఎదుటివారి ఎంతటివారైనా, ఎలాంటివారైనా ఆపదలో ఉన్నారంటే ఆదుకునే ఆపద్భాంధవుడిగా.. సామాన్య జనాల కోసం బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు.. ఇలా ప్రతి విషయంలో ఎల్లప్పుడూ ఆదర్శంగా నిలుస్తూ వస్తున్నారు చిరంజీవి. ఓవైపు ఇండస్ట్రీ అభివృద్ధికి, సినీ కార్మికుల సంక్షేమానికి ముందుంటూ.. మరోవైపు ప్రజలకు నిరంతరం రక్తదానం, నేత్రదానం, ఇతర సేవా కార్యక్రమాలకై కృషి చేస్తున్నారు.…

రెండు భాగాలుగా ‘శ్రీ‌స‌త్య‌సాయి అవ‌తారం’ చిత్రం : త‌న 100వ చిత్రంగా ద‌ర్శ‌కుడు సాయి ప్ర‌కాష్ ప్ర‌క‌ట‌న‌

రెండు భాగాలుగా 'శ్రీ‌స‌త్య‌సాయి అవ‌తారం' చిత్రం : త‌న 100వ చిత్రంగా ద‌ర్శ‌కుడు సాయి ప్ర‌కాష్ ప్ర‌క‌ట‌న‌

అన్ని భాష‌ల వారు న‌టించ‌నున్న ఈ చిత్రం ద‌స‌రా నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్‌ శ్రీ‌శ్రీ‌పుట్ట‌ప‌ర్తి సాయిబాబాగారి గురించి తెలియంది కాదు. ఆయ‌న్ను భ‌క్తులు క‌దిలే దైవంగా చూస్తారు. ప్ర‌జ‌ల‌కు ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేశారు. కోట్లాది మంది భ‌క్తులు ఆయ‌న‌కున్నారు. అలాంటి స్వామి గురించి ఇప్ప‌టిత‌రానికి, రాబోయే త‌రానికి కూడా తెలియ‌జేయాల‌నే మంచి సంక‌ల్పంతో `శ్రీ‌స‌త్య‌సాయి అవ‌తారం` చిత్రం వెండితెర‌కెక్క‌బోతోంది. క‌న్న‌డ‌, తెలుగు భాష‌ల్లో అంద‌రికీ తెలిసిన ద‌ర్శ‌కుడు సాయి ప్ర‌కాష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం విశేష‌మైతే, ఆయ‌న‌కిది 100వ చిత్రం కావ‌డం మ‌రో విశేషం. ఈ చిత్రాన్ని స్వామి భ‌క్తులు ప్ర‌ముఖ డాక్ట‌ర్ దామోద‌ర్ నిర్మిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌స‌త్య‌సాయి అవ‌తారం చిత్రంకు సంబంధించి లోగోను సోమ‌వారంనాడు ఏకాధ‌శి రోజున హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్‌లో జ‌రిగిన వేడుక‌లో ముర‌ళీమోహ‌న్, సుమ‌న్‌, సి.క‌ళ్యాణ్‌ ఆవిష్క‌రించారు. అనంత‌రం సాయి…

Tharun Bhascker Dhaassyam, VG Sainma’s Pan-India movie ‘Keedaa Cola’ Begins With A Grand Opening

Tharun Bhascker Dhaassyam, VG Sainma's Pan-India movie 'Keedaa Cola' Begins With A Grand Opening

The Young and talented director Tharun Bhascker Dhaassyam directed Pellichoopulu and Ee Nagaraniki Emaindhi and both achieved big success. The director, who seems bold in making youth-full entertainer movies, is going to bring a new crime comedy movie ‘Keedaa Cola’ to the audience this time. This film, which is going to be released as production number 1 under the VG Sainma banner, had a grand launch today. Producer Suresh Babu, heroes Siddharth, Teja Sajja, Nandu and many young directors attended the grand launching event and conveyed their best wishes to…

తరుణ్ భాస్కర్ దాస్యం పాన్ ఇండియా మూవీ ‘కీడా కోలా ప్రారంభం

Tharun Bhascker Dhaassyam, VG Sainma's Pan-India movie 'Keedaa Cola' Begins With A Grand Opening

యంగ్ అండ్ ట్యాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది.. రెండూ పెద్ద విజయాలు సాధించాయి. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలను తీయడంలో దిట్ట అనిపించుకున్న తరుణ్ భాస్కర్ ఈసారి సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా తెరకెక్కబోతోన్న ఈ చిత్రం ఈ రోజు గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. గ్రాండ్ గా జరిగిన లాచింగ్ ఈవెంట్ కి నిర్మాత సురేష్ బాబు, హీరోలు సిద్ధార్థ్, తేజ సజ్జా, నందు, పలువురు యువ దర్శకులు హాజరై చిత్ర యూనిట్ కి బెస్ట్ విశేష్ అందించారు. త్వరలోనే చిత్ర యూనిట్ షూటింగ్ ప్రారంభించనుంది. శ్రీపాద్ నందిరాజ్, సాయికృష్ణ గద్వాల్, ఉపేంద్ర వర్మ,…

`ఆకాశ వీధుల్లో..` ట్రైలర్ విడుద‌ల .. సెప్టెంట‌ర్ 2న సినిమా విడుద‌ల‌

`ఆకాశ వీధుల్లో..` ట్రైలర్ విడుద‌ల .. సెప్టెంట‌ర్ 2న సినిమా విడుద‌ల‌

గౌతమ్‌ కృష్ణ, పూజితా పొన్నాడ జంటగా నటించిన చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. గౌతమ్‌ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతోన్న ఈ చిత్రాన్ని మనోజ్‌ జేడీ, డా. డీజే మణికంఠ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘శిలగా ఇలా నేనే మిగిలానుగా.. జతగా నువ్వు లేని ఏకాకిగా..’ అనే పాటల‌ను ఇటీవ‌లే విడుదల చేశారు. ఈ పాటకు చైతన్య ప్రసాద్‌ లిరిక్స్‌ అందించగా, సింగర్‌ కాల భైరవ పాడారు. జూడా శాండీ ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌. చైతన్య ప్రసాద్, శ్రేష్ట, రాకేందు మౌళి ఈ సినిమా పాటలకు సాహిత్యాన్ని అందించారు. కాగా, మంగ‌ళ‌వారం నాడు ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌లైంది. అనంత‌రం సంగీత ద‌ర్శ‌కుడు జూడా శాండీ మాట్లాడుతూ, నా అస‌లుపేరు రాజేష్ రాధాకృష్ణ‌న్‌. గౌత‌మ్ కృష్ణ‌. నాకు అవ‌కాశం ఇచ్చి ప్రోత్స‌హించారు. అంద‌రికీ న‌చ్చే సినిమా. చిత్ర…