టాలీవుడ్ టైమ్స్ ప్రతినిధి – ఆలేరుఆలేరు పట్టణం లోని కొలనుపాక రోడ్డు నుండి దుర్గామాత గుడి వరకు ప్రధాన రహదారిని కలిపే బైపాస్ రోడ్డును ఇటీవలే విస్తరించారు,దీని ప్రక్కనే వ్యవసాయ బావికి ఎలాంటి రక్షణ హెచ్చరిక బోర్డులు లేకపోవడం వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నవని బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి బందెల సుభాష్ సోమవారం ఒక ప్రకటన లో ఆవేదన వ్యక్తం చేశారు పట్టణం లో రైల్వే గేట్ వద్ద అండర్ పాస్ నిర్మాణం అసంపూర్తిగా నిలిచి పోవడం మరియు పట్టణం లోని ఆర్ ఓ బీ చుట్టూ దూరంగా ఉండడం తో ఇటు సిద్దిపేట కొలనుపాక అటు హైదరాబాద్, వరంగల్ రహదారులకు ఇరువైపులా రాకపోకలు సాగించే ఆర్ టీ సి బస్సులు, ప్రయివేట్ వాహనాలు, ఆటోలు, ద్విచక్ర వాహన చోదకులతో ఈ రహదారి రద్దిగా…
Category: MOVIE REVIEWS
సినీ కార్మికులకు వాక్సిన్ డ్రైవ్ పునః ప్రారంభం : చిరంజీవి
కరోనా క్రైసిస్ ఛారిటిని మొదలెట్టి గత ఏడాది కరోనా సమయంలో సినిమా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన విషయం తెలిసిందే. ఈ సారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పుడు సినిమా కార్మికులకు వాక్సిన్ వేయించే కార్యక్రమం సోమవారం ఉదయం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ శంకర్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, సెక్రెటరీ దొరై లతో పాటు పలువురు సినీ టెక్నీషియన్స్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ .. కరోనా క్రైసిస్ చారిటి కింద ఈ రోజు సినిమా వర్కర్స్ 24 క్రాఫ్ట్స్ వారికీ, ఫిలిం ఫెడరేషన్ వారందరికీ, అలాగే వారితో పాటు మూవీ…
ఆలేరు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
టాలీవుడ్ టైమ్స్ ప్రతినిధి – ఆలేరు తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఆదేశాల మేరకు ఆలేరు పట్టణంలో ఆలేరు యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి.సంపత్ ఆధ్వర్యంలో పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేసిన అనంతరం తహసీల్దార్కి వినతిపత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలేరు యూత్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు జూకంటి.సంపత్ మాట్లాడుతూ లీటర్ పెట్రోలు వంద రూపాయలు దాటి సామాన్య ప్రజలకు పెనుభారంగా మారింది. పెట్రోల్ డీజిల్ కాక, నిత్యవసర వస్తువులు నూనె వంట గ్యాస్ సామాన్య ప్రజలపై భారం పడుతుంది. కరోన మహమ్మారి ప్రజల ప్రాణాలను తీస్తుంటే మన కేంద్ర ప్రభుత్వం మాత్రం సామాన్యుల పై అధిక ధరలు వేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటుంది కరోన కాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రజలను దోచుకుంటున్నది.…
మూటకొండూరు మండలం కదిరేనిగూడెంలో అనాధ పిల్లలకు హెచ్ఎంటీవి చేయూత
ఎనిమిది నెలలక్రితం తల్లి నల్లమాస యమున గుండెపోటుతో చనిపోగా …తండ్రి నల్లమాస అశోక్ తాటి చెట్టు పై నుంచి పడి చికిత్స పొందుతూ చనిపోయారు…. దీంతో ముగ్గురు అమ్మాయిలు రేణు ( 10 ) సుప్రియ ( 8 ) జ్యోస్నవి (4) లు అనాధలు మారగా….ఆర్ధిక పరిస్థితి సరిగా లేని ఆ కుటుంబానికి కొంత ఆర్ధిక చేయుత అందించింది…హెచ్ఎంటీవి ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ అశోక్ అధ్వర్యంలో పదివేల రూపాయల నగదు తో పాటు క్వింటా బియ్యం అందించాము ఈ కార్యక్రమం లో హెచ్ఎంటీవి సిబ్బంది ,మోత్కూర్ రిపోర్టర్ రమేష్ ,గ్రామస్థులు జెట్ట నరేందర్ మాజీ సర్పంచ్ ,తొండల సత్యనారాయణ, తొండల బాలరాజు ,వేముల విఠల్ , గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొనగా ,నల్లమాస అశోక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు
కరోనాను తరిమేద్దాం : నటి వరలక్ష్మీ శరత్‌కుమార్
అనవసర విషయాల గురించి ఆలోచించి వ్యాక్సిన్ వేయిచుకోకుండా ఉండొద్దని చెబుతున్నారు నటి వరలక్ష్మీ శరత్ కుమార్. అలాగే తాను ఫస్ట్ డోస్ వ్యాక్సిన్‌ను తీసుకున్నట్లుగా ఒక వీడియో ద్వారా తెలిపారు. ‘వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడవద్దు. ఊదాహరణకు బైక్‌పై వెళ్లేవారు ఊహించని ప్రమాదాన్ని ఆపలేరు. కానీ వారు హెల్మెట్ ధరించినట్లయితే ప్రాణాలను కాపాడుకోవచ్చు. వ్యాక్సిన్ కూడా అంతే. వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రాన కరోనా రాదని కాదు. కానీ వ్యాక్సిన్ వేయించుకున్నట్లయితే కరోనా తీవ్రత మనలో తక్కువగా ఉంటుంది. ప్రాణాలకు హాని ఉండదు. అలాగే వ్యాక్సిన్ వేయించుకున్న అందరికీ సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఒకవేళ వచ్చినా కూడా అవి నార్మలే. ఇంకో విషయం ఏంటంటే …వ్యాక్సిన్ వేయించు కున్నవారు ఎవరూ ఇంత వరకు చనిపోలేదు. శరీరంలో మరేదైన సమస్య ఉంటే దాని కారణంగా మరణించారు. ఒకవేళ ఏదైనా ఆనారోగ్య సమస్య…
సంతోష్ శోభన్ హీరోగా ‘ప్రేమ్ కుమార్’
సంతోష్ శోభన్ హీరోగా సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై.లి. శివప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్న చిత్రానికి ‘ప్రేమ్ కుమార్’ టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంతో అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో రాశీ సింగ్ హీరోయిన్. కృష్ణచైతన్య, రుచిత సాధినేని, కృష్ణతేజ, సుదర్శన్, అశోక్ కుమార్, ప్రభావతి, మధు ఇతర తారాగణం. ఆల్రెడీ 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. లాక్‌డౌన్ తర్వాత మిగతా భాగం పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈరోజు చిత్రాన్ని ప్రకటించడంతో పాటు టైటిల్ వెల్లడించారు. దర్శకుడు అభిషేక్ మహర్షి మాట్లాడుతూ “సాధారణంగా తెలుగు సినిమా పతాక సన్నివేశాల్లో హీరో వచ్చి స్పీచ్‌లు ఇచ్చి హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటాడు. కానీ, అదే పెళ్లి పీటలు మీద ఉన్న పెళ్లికొడుకును మాత్రం ఎవరూ పట్టించుకోరు. అటువంటి ఓ పెళ్లికొడుకు తనకు పెళ్లి అవ్వడం లేదనే ఫ్రస్ట్రేషన్‌లో…
రక్షిత్శెట్టి పాన్ ఇండియా మూవీ ‘777 చార్లి’ టీజర్ విడుదల చేసిన నేచురల్ స్టార్ నాని
అతడే శ్రీమన్నారాయణ చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్న కథానాయకుడు రక్షిత్ శెట్టి మరో విభిన్నమైన కథా చిత్రం ‘777 చార్లి’తో ఆడియెన్స్‌ను అలరించడానికి సిద్ధమవుతున్నారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రం విడుదలకు సన్నద్ధమవుతోంది. ఇందులో ఓ కుక్క టైటిల్ పాత్రలో నటించడం విశేషం. రక్షిత్ శెట్టి ఇందులో ప్రధాన పాత్రధారిగా నటిస్తూ జి.ఎస్.గుప్తాతో కలిసి ఈ సినిమాను నిర్మించారు. కిరణ్ రాజ్.కె దర్శకుడు. ఆదివారం(జూన్6) నాడు రక్షిత్ శెట్టి బర్త్ డే సందర్భంగా ఈ సినిమా తెలుగు టీజర్‌ను ఆదివారం నేచురల్ స్టార్ తన వాల్‌పోస్టర్ సినిమా యూ ట్యూబ్ ఛానల్‌లో విడుదల చేసి యూనిట్‌కు అభినందనలు తెలిపారు.టీజర్ విషయానికి వస్తే.. ‘ఏంటో ఏమో ఎవరెవరో నిండిన దారుల్లో…’ అంటూ సాగే ఈ…
భానుశ్రీ ప్రధాన పాత్రలో ‘సర్వే నెం.3’ చిత్రం ప్రారంభం
వాయిజా సినీ క్రియేషన్స్ పతాకంపై బిగ్‌బాస్ ఫేమ్ భానుశ్రీ ప్రధాన పాత్రలో.. డి. రామకృష్ణ (ఆర్.కె) దర్శకత్వంలో మేకా హేమసుందర్(మేకా ప్రసాద్) నిర్మిస్తోన్న చిత్రం ‘సర్వే నెం.3’. ఓ ప్రముఖ హీరో గెస్ట్ పాత్రలో నటించనున్న ఈ చిత్రం శనివారం (జూన్ 5) పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘బిల్లా’ మూవీ నిర్మాత డి. నరేందర్, నిర్మాత బెల్లంకొండ సురేష్ హాజరై చిత్రయూనిట్‌ను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.కె. మాట్లాడుతూ.. ‘‘నిర్మాత హేమసుందర్‌గారికి కూడా ఈ కథ ఎంతగానో నచ్చింది. ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు ఆయన ఎంతగానో సపోర్ట్ అందిస్తున్నారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాము. మా చిత్ర పూజా కార్యక్రమాలకు వచ్చి.. మమ్మల్ని ఆశీర్వదించిన పెద్దలందరికీ ధన్యవాదాలు..’’ అని తెలిపారు.నిర్మాత మేకా హేమసుందర్ మాట్లాడుతూ.. ‘‘ముందుగా…
సుద్దాల హనుమంతు
సుద్దాల హనుమంతు(06.06.1910 – 10.10.1982)జన్మ స్థలం:- నేటి యాదాద్రి-భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలోని పాలడుగులోతల్లిదండ్రులు:- బుచ్చిరాములు, లక్ష్మీనరసమ్మ“పల్లెటూరి పిల్లగాడాపసులుగాసే మొనగాడాపాలు మరిచి యెన్నాళ్ళయ్యిందో ఓ పాలబుగ్గల జీతగాడా కొలువు కుదిరి ఎన్నాళ్ళయ్యిందో”తెలంగాణలో ఈపాట పాడని పల్లె లేదు. పట్నం లేదు. జనుల నాలుకల మీదికెక్కిన ఈ అర్ద్ర మానవతాగీతం రాసింది తెలంగాణా సాయుధపోరాటంలో పెన్నూ, గన్నూ ధరించి పోరాడిన ప్రజాగెరిల్లాకవి సుద్దాల హనుమంతు. సాయుద పోరాటకాలంలో ప్రజల్ని యోధులుగా మార్చిన పాటలెన్నో ఆయన రాసారు. ఆమరణాంతం నమ్మిన సిద్ధాంతాలను ఆచరించినవాడు, ఆచరణకు అడ్డుపడ్డ అన్నింటినీ తృణప్రాయంగా త్యాగం చేసిన ధన్యజీవి.సుద్దాల హనుమంతు నేటి యాదాద్రి-భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలంలోని పాలడుగులో పుట్టాడు. నిజానికి వీరి తాతలవూరు ఇడుకుడ. హనుమంతు తాత పేరు కృష్ణహరి, నాయనమ్మ వెంకటరావమ్మ. తాతగారు హరికథ కళాకారుడు. హనుమంతు తండ్రి బుచ్చిరాములు, తల్లి…
‘ విక్రమ్’లోని పాటను విడుదల చేసిన శేఖర్ మాస్టర్
‘విక్రమ్’ చిత్రంలోని “పడిపోయా పడిపోయా….” అంటూ సాగే రెండవ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ విడుదల చేశారు.నాగవర్మ బైర్రాజును హీరోగా పరిచయం చేస్తూ, హరిచందన్ దర్శకత్వంలో ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. హీరో నాగవర్మ బైర్రాజు సరసన దివ్యాసురేశ్ కథానాయికగా నటించింది. కాగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో శనివారం ఈ చిత్ర హీరో, నిర్మాత నాగవర్మ బైర్రాజు పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను హైదరాబాద్ లో విడుదల చేశారు. అనంతరం ముఖ్య అతిథి శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ, “ఒకప్పుడు ప్రముఖ హీరో నాగార్జున గారు “విక్రమ్” అనే పేరు గల చిత్రంతో పరిచయమయ్యారు. అదే టైటిల్ తో వస్తున్న హీరో నాగవర్మకు కూడా ఈ తొలి చిత్రం మంచి విజయాన్ని అందించి… అతను హీరోగా…
