The stage is all set for the 25th movie of Satyadev, who has done a variety of movies and roles over the years. As a male lead, he has made a distinct mark in cinema. His new project is presented by Koratala Siva, the talented director who has made message-oriented movies in the commercial format from the beginning. The film is produced by Krishna Kommalapati under Arunachala Creations. Directed by VV Gopala Krishna, its concept poster was released today by the makers on the occasion of Satyadev’s birthday. The poster…
Category: MOVIE REVIEWS
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్ 25వ చిత్రం
వైవిధ్యమైన చిత్రాలు, విలక్షణమైన పాత్రలతో నటుడిగా, హీరోగా మెప్పిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న సత్యదేవ్ 25వ చిత్రానికి రంగం సిద్ధమైంది. మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలను కమర్షియల్ పంథాలో తెరకెక్కిస్తూ దర్శకుడిగా తనదైన ఇమేజ్‌ను సంపాదించుకున్న స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వి.వి.గోపాల కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నలుగురు వ్యక్తులు ఓ వ్యక్తిని కాల్చడానికి సిద్ధంగా ఉండటం, ఓ వైపు జీపు ఆగి ఉండటం అనే విషయాలను పోస్టర్‌లో గమనించవచ్చు. అలాగే సత్యదేవ్ లుక్ సరికొత్తగా ఉంది. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తున్న సత్యదేవ్ తన 25వ చిత్రంలో ఎలాంటి…
తెలుగు ,తమిళ భాషల్లో భగత్ సింగ్ నగర్
విదార్థ్, ధృవీక, బెనర్జీ, రవి ప్రకాష్ ముఖ్య పాత్రల్లో గ్రేట్ ఇండియా మీడియా హౌస్ బ్యానర్ పై వాలాజా క్రాంతి దర్శకత్వంలో రమేష్ వుడత్తు నిర్మాతగా తెలుగు ,తమిళ భాషలలో రూపొందుతున్న చిత్రం భగత్ సింగ్ నగర్. భగత్ సింగ్ నగర్ లో జరిగిన ఒక ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా..నిర్మాత రమేష్ వుడత్తు మాట్లాడుతూ…భగత్ సింగ్ నగర్(తెలుగు & తమిళ్) సినిమాను గ్రేట్ ఇండియా మీడియా హౌస్ బ్యానర్పై నిర్మించినందుకు గర్వంగా ఉంది. భగత్ సింగ్ నగర్ లో జరిగిన ఒక ప్రేమకథ ను దర్శకుడు అందంగా చూపించారు. దర్శకుడు వాలాజా క్రాంతి చెప్పిన పాయింట్ నచ్చి ఈ సినిమా చేశాను. నా రెండో సినిమా కూడా వాలాజా…
‘రిచిగాడి పెళ్లి’ టైటిల్ ఫస్ట్ లుక్ విడుదల
కెఏస్ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ నటీనటులు గా కె ఎస్ హేమరాజ్ దర్శకత్వంలో కె ఏస్ ఫిల్మ్ వర్క్స్ నిర్మిస్తున్న “రిచి గాడి పెళ్లి ” చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ ను హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విడుదల చేశారు.తను విడుదల చేసిన టైటిల్ ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సందర్భంగా .. “రిచి గాడి పెళ్లి ” పేరుతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న దర్శకుడు కె.ఎస్.హేమరాజ్ మాట్లాడుతూ…*“జీవితం అంటే విభిన్న భావాల సమాహారం. వాటి వ్యక్తీకరణే మన జీవితపు దశాదిశా గమనాన్ని నిర్ణయిస్తుంది. ఈ చిత్రం మన దైనందిన జీవితాలలో భావవ్యక్తీకరణ యొక్క ప్రాముఖ్యతని నొక్కి చెప్తుంది. నటి ఐశ్వర్య రాజేష్ ఈ రోజు టైటిల్ ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా…
హీరో విశ్వ కార్తికేయ బర్త్‌డే సందర్భంగా పోస్టర్ విడుదల
విశ్వ కార్తికేయ, హ్రితిక శ్రీనివాసన్ హీరోహీరోయిన్లుగా అలీ, ఆమని, భాగ్యరాజా ప్రధాన పాత్రలలో ఆర్ ఆర్ క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం.1గా ఓ చిత్రం రూపొందుతోంది. చలపతి పువ్వల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి కోమలి సమర్పణలో ఎన్. చంద్రమోహన రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ రోజు హీరో విశ్వ కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ బర్త్‌డే పోస్టర్ ని విడుదలచేసింది చిత్ర యూనిట్.తారాగణం: విశ్వ కార్తికేయ, హ్రితిక శ్రీనివాసన్, భాగ్యరాజా, అలీ, ఆమని, తమిళ్ JP, తులసీ,జార్డమేరియన్,అప్పాజీ, అనంత్ , ఇళవరసన్, డానియెల్, స్వామినాథన్, కృష్ణవేణి, నారాయణ రావు, శివ సాంకేతిక వర్గం:బ్యానర్: R R క్రియేటివ్ కమర్షియల్సమర్పన: శ్రీమతి కోమలినిర్మాత: N చంద్రమోహన రెడ్డిదర్శకత్వం: చలపతి పువ్వలసంగీతం: రధన్ (జాతి రత్నాలు )కెమెరా: కళ్యాణ్ బోర్లగాడ్డఆర్ట్: చంద్రమోలిఎడిటర్ :శివకిరణ్పాటలు: రాంబాబు గోశాలడాన్స్:…
వెంకటేశ్,వరుణ్‌తేజ్ ‘ఎఫ్3’ షూటింగ్ పునః ప్రారంభం
విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీబ్యూటీ తమన్నా, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా బ్లాక్‌బస్టర్ టాక్‌తో 2019 సంక్రాంతి విన్నర్‌గా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం ‘ఎఫ్ 2’. ..వరుస విజయాలతో దూసుకెళ్తోన్న బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనీల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా భారీ వసూళ్లను సాధించిన ‘ఎఫ్2 ’చిత్రానికి ఫ్రాంచైజీగా ‘ఎఫ్ 3’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. దిల్‌రాజు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ ఎంటర్‌టైనర్‌కు ఫ్రాంచైజీగా వస్తోన్న సినిమా కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్ పరిస్థితులు చక్కబడిన నేపథ్యంలో రీస్టార్ట్ అయ్యింది. ఈ సందర్భంగాహిట్ చిత్రాల నిర్మాత…
సరికొత్త ప్రేమ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు విశ్వ కార్తికేయ
నేడు (జూలై 3) ఆయన జన్మదినోత్సవం చిన్న వయసు లోనే భిన్న మైన పాత్రలు పోషించి బాల నటుడిగా ప్రేక్షకుల ఈలలు, గోలల నడుమ వెండి తెరపై తలుక్కు మన్నాడు విశ్వ కార్తికేయ. ఆరేళ్ల వయసులో తెరంగేట్రం చేసి ‘జానకి వెడ్స్ శ్రీరాం’తో పరిణతి చెందిన నటుడుగా ప్రశంశలు అందుకున్నాడు. ‘ఆ నలుగురు’తో శభాష్ అనిపించుకొని నట కిరీటి కి అప్పడాలు ఎలా అమ్మాలో నేర్పి సక్సెస్ అయ్యాడు. మంచు విష్ణు మొదటి సినిమాలో మెరిశాడు. గోరింటాకులో రాజశేఖర్ చిన్నపటి పాత్రను అద్భుతం గా పండించి, లేత మనసులులో కళ్యాణి కొడుకుగా పెద్ద మనసుతో మెప్పించాడు. శివ శంకర్ లో బాల మోహన్ బాబుగా, బాపు గారి దర్శకత్వం లో బాల కృషుడిగా మై మరపించి బాపు గారి మనసులో స్థానం సంపాదించుకున్నాడు. అధినాయకుడులో చిన్నప్పటి బాలయ్యబాబు…
మోహన్‌బాబు గారి అభినందన గొప్ప అనుభూతి
‘బట్టల రామస్వామి…’ చిత్ర దర్శకుడు రామ్ నారాయణ్ అల్తాఫ్ హసన్ హీరోగా, శాంతిరావు, లావణ్యారెడ్డి, సాత్వికాజేలు హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్’. సెవెన్‌హిల్స్ సతీశ్, రామ్ వీరపనేని నిర్మించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు రామ్ నారాయణ్ తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని కూడా ఆయనే రూపొందించారు. ‘బట్టల రామస్వామి బయోపిక్’ ఇటీవలే జీ5 ఓటిటి చానల్‌లో విడుదలై చక్కని విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ‘బట్టల రామస్వామి…’ చిత్రాన్ని చూసిన అనేకమంది సెలబ్రిటీలు, విమర్శకులు సినిమా టీమ్‌ను అభినందించటం విశేషం. ఇదంతా ఒకెత్తయితే మంచు మోహన్‌బాబు సినిమాను చూసి దర్శకుడు రామ్ నారాయణ్‌ను పిలిపించుకుని అభినందించటం విశేషం. తనకు సినిమా ఎంతగానో నచ్చిందంటూ సినిమా షూటింగ్ విశేషాలను, ఎన్ని రోజుల్లో సినిమాను తెరకెక్కించారు, ఎక్కడెక్కడ చిత్రీకరణ చేశారు అని అనేక విషయాలను…
బహుజనులు రాజ్యాధికారంలోకి రావాలి
బహుజన సామాజిక ఉద్యమం ఫూలే…అంబేడ్కర్ మహానీయుల మార్గంలో రావాలి తమ్మడి పద్మారావు (ఉద్యమాల ఉపాధ్యాయుడు) భారతదేశంలో మతం పేరుతో రాజ్యాన్ని ఏలుతున్నారు..కాబట్టి వారికి ప్రజాసంక్షేమం కంటే వారి బ్రాహ్మణ మత సంక్షేమమే కావాలి.వారి బ్రాహ్మణ మతం వారికి సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక ఆధిపత్యాన్ని ఇస్తుంది.ఈ దేశంలో ప్రజా సంక్షేమం కావాలంటేబహుజనులు రాజ్యాధికారంలోకి రావాలి.బహుజనులు రాజ్యాధికారం లోకి రావాలంటే..ఆర్య బ్రాహ్మణులచేత విడదీయబడిన వేల కులాలను ఐక్యం చేసే బహుజన సామాజిక నిర్మాణం జరగాలి.కాబట్టి కుల సమాజాన్ని బహుజన సమాజంగా నిర్మించే సామాజిక ఉద్యమం అవసరం.సామాజిక ఉద్యమం కుల సంఘాల వలన రాదు.బహుజన సామాజిక ఉద్యమం ఫూలే…అంబేడ్కర్ మహానీయుల మార్గంలో రావాలి.వేల కులాల నడుమ స్నేహ, బంధుత్వ, సహకార, సోదర భావాన్ని పెంపొందించాలి.వేల జాతుల సంక్షేమం కోసం,వేల జాతుల అధికారాలు, ఆస్తులు, అవకాశాలు, హక్కులు, రక్షణ, ఆత్మగౌరవం కోసం…
‘గమ్మత్తు’ చిత్రం టైటిల్ లోగో ఆవిష్కరణ
సూపర్ స్టార్ స్టూడియోస్ బ్యానర్ పై అంకిత శ్రీనివాస్ రావు , బుయ్యాని మహేష్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన ‘గమ్మత్తు’ చిత్రం టైటిల్ లోగోను ప్రముఖ నిర్మాత బెక్కెం వేణు గోపాల్ ఆవిష్కరించారు. ఈ చిత్రానికి దర్శకుడు అశ్వని శ్రీ కృష్ణ. ఈ చిత్రానికి కేరింత ఫేం పార్వతీశం, బిగ్ బాస్ ఫేం స్వాతి దీక్షిత్, జబర్దస్త్ ఫేం రాకెట్ రాఘవ, వకీల్ సాబ్ సూపర్ వుమెన్ అయినటువంటి లిరీష తారాగణం. ఈ చిత్రానికి వసంత్ సంగీత దర్శకత్వం వహించగా, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : లక్ష్మీకాంత్ కనికే, ఎడిటర్: శ్రీకాంత్ పట్నాయక్. ప్రణవ్ స్వరూప్ ఎగ్సిగ్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్ర నిర్మాణం పనులన్నీ పూర్తి చేసుకోని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నది. ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కూడా పూర్తి చేసుకుని అతి…
