~innovation for enhancing Customer experience and delight ~ ~Enjoy both Telugu and Tamil entertainment in 4K and Dolby Audio with aha Gold~ National, August XX, 2022: aha, one of India’s leading language OTT platforms announced the launch of aha GOLD– a premium annual subscription offering created to deliver exciting 4K ultra HD video streaming combined with high quality Dolby audio to enhance the overall customer experience. As part of this annual subscription, viewers now have access to all of aha’s new releases, including movies, TV shows, and original content –…
Category: MOVIE REVIEWS
‘ఆహా గోల్డ్’గా అప్ గ్రేడ్ అవుతోన్న ఆహా ప్రీమియమ్.. లోగో ఆవిష్కరించిన ‘కలర్ ఫొటో’ టీమ్!
తెలుగు ఓటీటీ మాధ్యమాల్లో అగ్రగామిగా కొనసాగుతోన్న ఆహా.. ఇప్పుడు ఆహా గోల్డ్‌ను లాంఛ్ చేసింది. ఈ ప్రీమియంలో వార్షిక సబ్‌స్క్రిప్షన్‌లో హై క్వాలిటీలో 4కె అల్ట్రా హెచ్‌డీ వీడియోలను స్ట్రీమింగ్ ద్వారా అందించనుంది. ఇది డాల్బీ సౌండ్‌లో కస్టమర్‌కు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించనుంది. వార్షిక సబ్‌స్క్రిప్షన్‌లో ఉన్నవారందరూ ఇప్పుడు ఆహాలో కొత్తగా రిలీజ్ అవుతోన్న సినిమాలు, టీవీ షోస్, ఓరిజినల్ కంటెంట్‌ను తెలుగు, తమిళ భాషల్లో వీక్షించవచ్చు. అది కూడా ఎలాంటి యాడ్స్ లేకుండా. కస్టమర్స్ ప్రాధాన్యతను గుర్తించి దాన్ని మరింతగా పెంపొందించడమే అంతిమ లక్ష్యంగా ఆహా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అంతే కాకుండా.. కస్టమర్స్ స్మార్ట్స్ టీవీల్లోతమకు ఇష్టమైన కంటెంట్‌ను వీక్షించే సమయంలో ఆ అనుభూతిని మరింత పెంచడం కూడా ఈ లక్ష్యంలో భాగమే. 100 శాతం లోకల్ కంటెంట్, సరికొత్త సాంకేతికత కాంబినేషన్‌తో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా హిలేరియస్ ఎంటర్‌టైనర్ ‘కళాపురం’ ట్రైలర్ విడుదల
‘పలాస 1978’ .. ‘శ్రీదేవి సోడా సెంటర్’ వంటి రా అండ్ రస్టిక్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించటమే కాదు.. విమర్శకుల ప్రశంసలు అందుకున్న కరుణ కుమార్ ఈసారి అందుకు భిన్నంగా కామెడీ డ్రామా కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తోన్న చిత్రమే ‘కళాపురం’ ‘ఈ ఊరిలో అందరూ కళాకారులే’ సినిమా క్యాప్షన్. ఆగస్ట్ 26న సినిమా రిలీజ్ అవుతోంది. సాధారణ సినీ ప్రేక్షకులే కాదు.. సినీ విమర్శకులు సైతం కరుణ కుమార్ డిఫరెంట్ సినిమాలను ఎంపిక చేసుకుని వాటిని తెరకెక్కిస్తోన్న తీరుని ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్‌సమర్పణలో ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రజనీ తాళ్లూరి.. కళాపురం సినిమాను నిర్మిస్తున్నారు. సత్యం రాజేష్, చిత్రం శ్రీను, రక్షిత్ అట్లూరి తదితరులు నటించారు. ఇప్పటికే విడుదలైన కళాపురం సినిమా ఫస్ట్ లుక్, టీజర్, పోస్టర్స్, సాంగ్ అన్నీ సినిమాపై…
విజయనిర్మల మనవడు శరణ్ హీరోగా నటిస్తున్న `మిస్టర్ కింగ్` నుండి మెలోడి బ్రహ్మ మణిశర్మ కంపోజింగ్ లో సిన్ని సిన్ని లిరికల్ వీడియో విడుదల
విజయ నిర్మల గారి మనవుడు శరణ్ కుమార్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. సీనియర్ నరేశ్ అల్లుడు (నరేశ్ కజిన్ రాజ్‌కుమార్ కొడుకు) శరణ్ కుమార్ హీరోగా`మిస్టర్ కింగ్`చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని హన్విక క్రియేషన్స్ పతాకంపై బి.ఎన్.రావు నిర్మిస్తున్నారు. శశిధర్ చావలి దర్శకత్వం వహిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం నుండి సిన్ని సిన్ని పాట లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. వినగానే ఆకట్టుకునే క్యాచి ట్యూన్ తో ఈ పాటని యూత్ ఫుల్ నెంబర్ గా స్వరపరిచారు మణిశర్మ. క్రేజీ సింగర్ రాహుల్ సిప్లిగుంజ్ పాటని ఎనర్జిటిక్ గా పాడారు. ♫ మరీ ఇంత అందమేంటి సిన్నీ సిన్నీ మహాద్భుతం అంటారేయ్ తెలుగులో దీన్ని ఎలా లెక్కపెట్టగలనీ వన్నెలు ఇన్ని తెల్లార్లు కూర్చున్నా మిగులును కొన్ని సిన్ని సూడు…
విజయ్ దేవరకొండ ‘లైగర్’ నుండి డ్యాన్స్ నంబర్ కోకా 2.0 పాట విడుదల
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ లోని పెప్పీ నంబర్ అక్డి పక్డి హ్యాంగోవర్ నుండి ఇంకా బయటికిరాకముందే, ఇప్పుడు డబుల్ ఎనర్జీ, డబుల్ స్వాగ్, డబుల్ బీట్‌తో విడుదలైన కోకా 2.0 పాట సెలబ్రేషన్స్ ని మరింత పెంచింది. లిజో జార్జ్-డిజె చేతస్ మరొక డ్యాన్స్ నంబర్‌తో ముందుకు వచ్చిన ఈ పాటలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఎలిగెంట్ మూమెంట్స్ తో అదరగొట్టారు. ఆకట్టుకునే డ్రెస్సింగ్, వైబ్రెంట్ సెట్, కొరియోగ్రఫీ.. ఇలా ప్రతిది పర్ఫెక్ట్‌గా వుంది. గాయని గీతా మాధురితో కలిసి ఈ ఫాస్ట్ బీట్ నంబర్‌ని పాడడంలో రామ్ మిరియాల తన మార్క్ చూపించాడు. భాస్కరభట్ల సాహిత్యం అందించిన సాహిత్యం కూడా ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే అదిరిపోయే డ్యాన్సులు…
వీరభద్రం చౌదరి దర్శకత్వంలో ‘దిల్ వాలా’ ప్రారంభం
పూలరంగడు, చుట్టాలబ్బాయి లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వీరభద్రం చౌదరి దర్శకత్వంలో మత్తువదలారా, సేనాపతి చిత్రాలతో ప్రసంశలు అందుకున్న నరేష్ అగస్త్య హీరోగా డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్ పై నబిషేక్, తూము నర్సింహా పటేల్ నిర్మిస్తున్న చిత్రం దిల్ వాలా. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. సినిమా లాంచింగ్ ఈవెంట్ లో దర్శకుడు వివి వినాయక్ క్లాప్ ఇవ్వగా హీరో అల్లరి నరేష్ స్క్రిప్ట్ ని అందించగా అలీ కెమరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం దర్శకుడు వీరభద్రం చౌదరి మాట్లాడుతూ.. వివి వినాయక్ గారు సినిమాకి క్లాప్ కొట్టి ఆశీర్వాదించడం చాలా ఆనందంగా వుంది. అలాగే మా మొదటి సినిమా హీరో అల్లరి నరేష్ గారు ఇక్కడి వచ్చి బెస్ట్ విశేష్ అందించడం, అలీ గారు రావడం సంతోషంగా…
నాగ్ అశ్విన్ చేతుల మీదుగా @ లవ్ టైటిల్ లోగో విడుదల !!!
ఓ విభిన్నమైన కథ కథనాలతో సహజత్వానికి దగ్గరగా రాబోతున్న సరికొత్త చిత్రం ‘@లవ్’. రామరాజు, సోనాక్షి వర్మ, అభి, ప్రీతి సింగ్, శ్రీకృష్ణ మరియు డాక్టర్ మారుతి సకారం తదితరులు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా టైటిల్ లోగోను టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ లాంచ్ చేశారు. గిరిజన నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమ కథతో రాబోతున్న ఈ సినిమా, ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని.. అందులో భాగంగానే.. నేడు తాను ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నానని నాగ్ అశ్విన్ చెప్పారు. వాస్తవానికి చాలా దగ్గరగా ఉండే ఈ కథ, ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర దర్శక నిర్మాతలు చెబుతున్నారు. TMS బ్యానర్ లో ప్రీతమ్ ఆర్ట్స్ &SN క్రియేషన్స్ కలయికతో మహేందర్ సింగ్, శైలజ తాటిచెర్ల మరియు…
బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న కల్యాణ్ రామ్ ‘బింబిసార’
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నవతరం దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘బింబిసార’ కలెక్షన్ల ప్రవాహం సునామీ సృష్టించేలా ఉంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తూ విజయపథంలో పరుగులు పెడుతోంది. అంతేకాదు.. కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడం ఓ రికార్డు.నాలుగోరోజైన సోమవారం కూడా ‘బింబిసార’ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేసింది. మూడో రోజుకే బ్రేక్ ఈవెన్ సాధించిన చిత్రాలు అరుదు. అలాంటి రికార్డును ‘బింబిసార’ చిత్రం సాధించింది. అని స్వయంగా ‘బింబిసార’ సక్సెస్ మీట్‌లో దిల్ రాజు చెప్పడం గమనార్హం. ఈ సినిమా విడుదలకు 15 రోజుల ముందు నేను సినిమా చూశాను. సినిమా చూసినప్పుడే గట్టిగా కొడుతుందని అనుకొన్నాను. కానీ ఏ రేంజ్‌లో హిట్ అవుతుందనే విషయంపై అంచనా వేయలేకపోయాను. ఇంత…
సరికొత్త `సన్ షైన్` ఓటీటీ ప్లాట్ ఫామ్ లోగో లాంచ్
మలేషియాలో ఎస్టాబ్లిష్డ్ డ్ అయిన `సన్ షైన్` ఓటీటీ సంస్థని త్వరలో ఇండియాలో తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ తో (టియఫ్ సిసి) తో టయ్యప్ అవుతూ ప్రారంభించబోతున్నారు `సన్ షైన్ ` సిఎమ్ డి బొల్లు నాగ శివప్రసాద్ చౌదరి. ఈ సందర్భంగా ఈ రోజు ఎఫ్ ఎన్ సీసీలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టియఫ్‌సిసి ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ…“`ఇప్పటికే మలేషియాలో ఎస్టాబ్లిష్ అయిన సన్ షైన్ ఓటీటీ సంస్థని ఇండియాలో మా టియఫ్ సీసీతో కలిసి ప్రసాద్ గారు త్వరలో ప్రారంభించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఇండియాలో ఓటీటీల హవా నడుస్తోంది. ఈ ఓటీటీ ద్వారా తెలుగు తో పాటు అన్ని భాషల చిత్రాలు రిలీజ్ చేయనున్నాం. అలాగే షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్ కూడా…
వరుణ్ హీరోగా ‘పూర్ణ’ ప్రారంభం
వరుణ్ హీరోగా సోనాక్షి వర్మ, చైతన్య ప్రియ హీరోయిన్స్ గా యం ఆర్డీ ప్రొడక్షన్స్ పతాకంపై టాలెంటెడ్ డైరెక్టర్ యం ఆర్ దీపక్ దర్శక,నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం పూర్ణ. లవ్ స్టోరీతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న పూర్ణ చిత్రం ఆగస్ట్ 7న హైదరాబాద్ ఫిలిం నగర్ ఫిలించాంబర్లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం హీరో,హీరోయిన్స్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ క్లాప్ నివ్వగా నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ కెమెరా ఆన్ చేశారు. ఈ సన్నివేశానికి ప్రముఖ దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ గౌరవ దర్శకత్వం వహించారు. స్క్రిప్టును తెలంగాణ ఫిలింఛాంబర్ సెక్రటరీ అనుపమ్ రెడ్డి చిత్ర యూనిట్ కి అందించారు. అనంతరం ఏర్పాటైన పాత్రికేయుల సమక్షంలో హీరో వరున్, హీరోయిన్స్ సోనాక్షి వర్మ, చైతన్య…
