After delivering a smashing hit ‘Oh Baby!’, Suresh Productions, Guru Films and Kross Pictures have joined forces for the official remake of South Korean action-comedy film Midnight Runners. D. Suresh Babu, Sunitha Tati and Hyunwoo Thomas Kim are producing the movie. Regina Cassandra and Nivetha Thomas have played the lead roles in the movie helmed by the very talented director Sudheer Varma. The makers came up with release date of the movie. Saakini Daakini will be releasing in theatres on September 16th. The release date poster sees the daredevil ladies…
Category: MOVIE REVIEWS
సరికొత్త కాన్సెప్ట్ తో వస్తోన్న ‘భారత్ కీ నారీ’ చిత్రం డెఫినెట్ గా మంచి హిట్ అవుతుంది : ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్
దేశ సరిహద్దుల్లో సైనికులు తమ ప్రాణాలకు తెగించి ఒక బాధ్యతతో పోరాడతారు.. అలాగే వారి సతీమణులు కూడా అంతే బాధ్యతతో కుటుంబాలను చూసుకొని రక్షణగా నిలుస్తారు.. మరి అలాంటి తరుణంలో భార్యలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు.. అనే సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న చిత్రం “భారత్ కీ నారీ”. ఎం.డి. నజీర్ ఉద్దీన్ హీరోగా సీతా మహాలక్ష్మీ హీరోయిన్ గా అఖిల్ గంధం సమర్పణలో డి యస్ ఆర్ ప్రొడక్షన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ దర్శకుడు డి యస్ రాథోడ్ దర్శకత్వంలో యం డి. నమీర్ ఉద్దీన్ అహ్మద్ తెలుగు హిందీ భాషల్లో “భారత్ కీ నారీ” చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఆగస్ట్ 15 ఆజాధికా అమృత్ మహోత్సవ్ 75వ స్వాతంత్రం దినోత్సవం సందర్బంగా భారత్ కీ నారీ చిత్రం మోషన్ పోస్టర్ ని…
ఓటీటీలో దూసుకెళ్తోన్న లెస్బియన్ చిత్రం `హోలీ వుండ్`
సహస్ర సినిమాస్ ప్రై. లి సమర్పణలో జానకి సుందర్, అమృతా వినోద్, సాబు ప్రౌదిక్ ప్రధాన పాత్రల్లో సందీప్ ఆర్ మలయాళంలో నిర్మించిన చిత్రం `హోలీవుండ్`. అశోక్ ఆరాన్ దర్శకుడు. లెస్బియన్ నేపథ్యంలో రూపొందిన ఈ సైలెన్స్ సినిమా ఎన్నో కాంట్రవర్సీల మధ్య ఈ నెల 12న ఎస్ ఎస్ ఫ్రేమ్స్ ఓటీటీ ద్వారా గ్రాండ్ గా రిలీజై మొదటి రోజే లక్షల మంది వీక్షకుల మనసు దోచుకుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ…“మలయాళంలో వచ్చిన మొదటి లెస్బియన్ చిత్రానికి బుకింగ్స్ చూసి మేమే ఆశ్చర్యపోయాం. వేరే ఓటీటీల్లో లక్షల్లో వీక్షకులు అవకాశం తక్కువ. ఎస్ ఎస్ ఫ్రేమ్స్ లో కేవలం 18 గంటల్లో మూడు లక్షల మంది సినిమా చూశారు. ఈ చిత్రం చూడటానికి ఓటీటీ యాప్ డౌన్ లోడ్ అవసరం లేదు. పైన ఉన్న…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్’ సరికొత్త పోస్టర్ వచ్చేసింది.. సెప్టెంబర్ 28, 2023లో చిత్రం విడుదల
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ మూవీ ‘సలార్’. ఫ్యాన్స్, ప్రేక్షకులు, యావత్ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రమిది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 28, 2023న రిలీజ్ అవుతోంది. అనౌన్స్‌మెంట్ రోజు నుంచే భారీ అంచనాలను క్రియేట్ చేస్తూ ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అందులో ప్రభాస్ ఫస్ట్‌లుక్ ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది. ఎప్పుడెప్పుడు ప్రభాస్‌ను వెండితెరపై చూస్తామా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రభాస్ పాత్రకు సంబంధించిన సరి కొత్త లుక్‌ను విడుదల చేయటంతో పాటు రిలీజ్ డేట్…
మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల ‘ధమాకా’ ఫస్ట్ సింగిల్ జింతాక్ లిరికల్ వీడియో ఆగస్టు 18న విడుదల
మాస్ మహారాజా రవితేజ, త్రినాథరావు నక్కిన ఔట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “ధమాకా” విడుదలకు సిద్ధమౌతోంది. ఈ సినిమా షూటింగ్ పార్ట్ కూడా చివరి దశలో ఉంది. చిత్రాన్ని ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ల పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ జింతాక్ లిరికల్ వీడియో ఆగస్టు 18, మధ్యాహ్నం 12:01 గంటలకు విడుదల చేయనున్నారు. మాస్ నెంబర్ గా రాబోతున్న ఈ పాట పోస్టర్ లో రవితేజ సాంప్రదాయ దుస్తులలో శ్రీలీలా ను ఎత్తుకున్నట్లు కనిపించడం అలరిస్తోంది. పోస్టర్ లో వారి ఎక్స్ ప్రెషన్స్ చూస్తుంటే జింతాక్ మాస్ డ్యాన్స్…
శ్రీ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై సంగీత్ శోభన్ హీరోగా ‘ప్రేమ విమానం’ ప్రారంభం
శ్రీ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా నిర్మాణంలో సంతోష్ కట దర్శకత్వంలో సంగీత్ శోభన్ కథానాయకుడిగా నూతన చిత్రం’ ప్రేమ విమానం’ ఈరోజు లాంఛనంగా పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా ప్రారంభమైయింది. ముహూర్తపు సన్నివే శానికి ఏషియన్ గ్రూప్స్ భరత్ నారంగ్ క్లాప్ ఇవ్వగా, సునీల్ నారంగ్ స్క్రిప్ట్ అందించగా, గీతా ఆర్ట్స్ బాబీ కెమెరా స్విచ్ ఆన్ చేసి చిత్ర యూనిట్ కు బెస్ట్ విశేష్ అందించారు. న్యూ ఏజ్ లవ్ స్టోరీ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో సాన్వే మేఘన కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. కల్పలత, సుప్రీత్, శైలజ ప్రియ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, జగదీష్ చీకటి డీవోపీ గా, అమర్ రెడ్డి కుడుముల ఎడిటర్ గా పని చేస్తున్నారు. తారాగణం:…
వాహ్.. విజయ్ దేవరకొండ!!
తన వ్యక్తిత్వాన్ని మాటల్లోనే కాదు చేతల్లోనూ చూపిస్తుంటారు స్టార్ హీరో విజయ్ దేవరకొండ. నిజాయితీగా వ్యవహరించడం, మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం ఆయనకు అలవాటు. తానో స్టార్ ననే స్టేటస్ ఎప్పుడూ చూపించరు. ఆయన తన వ్యక్తిత్వాన్ని మరోసారి ప్రదర్శించారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన లైగర్ ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండను ప్రశ్నలు అడిగేందుకు ఓ పాత్రికేయుడు ఇబ్బంది పడ్డాడు. మీరు పాన్ ఇండియా స్టార్ అయ్యారు కాబట్టి ఫ్రీగా ప్రశ్నలు అడగలేకపోతున్నా అన్నారు. దానికి విజయ్ స్పందిస్తూ…అదేం లేదు ఫ్రీగా అడగండి ఎలాంటి సందేహాలు వద్దు అంటు ముందున్న టేబుల్ మీద కాలు పెట్టి ఇలా దర్జాగా అడగండి నేను ఎంత ఎదిగినా మీ వాడినే అని చెప్పారు. దీంతో అక్కడున్న ప్రతి ఒక్కరూ విజయ్ గ్రౌండెడ్ వ్యక్తిత్వం పట్ల ఆకర్షితులు అయ్యారు.
ఈనెల 26న వస్తున్న సునీల్-హెబ్బా పటేల్ నటించిన ‘గీత’
సంచలన దర్శకులు వి.వి.వినాయక్ ప్రియశిష్యుడు “విశ్వ”ను దర్శకుడిగా పరిచయం చేస్తూ… వి.వి.వినాయక్ ఆశీస్సులతో “గ్రాండ్ మూవీస్” పతాకంపై ఆర్.రాచయ్య నిర్మించిన విభిన్న కథాచిత్రం “గీత”. “మ్యూట్ విట్నెస్” అన్నది ఉప శీర్షిక. సెన్సార్ సహా అన్ని కార్య్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 26న విడుదల కానుంది!! క్రేజీ కథానాయిక హెబ్బా పటేల్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ ముఖ్యపాత్ర పోషించగా.. “నువ్వే కావాలి, ప్రేమించు” వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన సాయి కిరణ్ విలన్ గా నటించారు!! ఈ చిత్రం విడుదల సందర్భంగా దర్శకుడు విశ్వ మాట్లాడుతూ… “ఈ సినిమా అవకాశం నా గురువు, దైవం అయిన వినాయక్ గారే ఇప్పించారు. నిర్మాత రాచయ్యగారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను” అన్నారు. నిర్మాత ఆర్.రాచయ్య మాట్లాడుతూ……
సందడిగా సాగిన విజయ్ ఆంటోనీ ‘హత్య’ ట్రైలర్ విడుదల
తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న కొత్త సినిమా ‘హత్య’. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో విజయ్ ఆంటోనీ కనిపించనున్నారు. హీరోయిన్ రితికా సింగ్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. లోటస్ పిక్చర్స్ తో కలిసి ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగమ్ పిల్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్వీఎస్ అశోక్ కుమార్ నిర్మాతలు కాగా బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను హీరో నాని సోషల్ మీడియా ద్వారా విడుదల చేయగా.. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సందడిగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు బెల్లంకొండ సురేష్, జీవీజీ రాజు,…
ప్రముఖ నిర్మాత నారాయణ దాస్ నారంగ్ గారికి ఈ కార్తికేయ-2 చిత్రం అంకితం – అభిషేక్ అగర్వాల్
ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వచ్చిన చిత్రం కార్తికేయ 2. నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చిన కార్తికేయ -2 చిత్రం ఘనవిజయం సాధించింది. అన్ని చోట్ల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సంధర్బంగా కార్తికేయ- 2 చిత్ర బృందం థాంక్స్ మీట్ ను నిర్వహించారు. అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. దర్శకుడు చందు మొండేటి కథ చెప్పిన దానికంటే, అద్భుతంగా ఈ సినిమాను తీశారు. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. సినిమాకి అని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని చెబుతూ కార్తికేయ సాంకేతిక నిపుణలకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ.. రెండు పాండమిక్స్ తరువాత ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా సక్సెస్ తో ఆ కష్టం అంతా…
