వెర్స‌టైల్ యాక్ట‌ర్ తిరువీర్ హీరోగా మూన్‌షైన్ పిక్చ‌ర్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.1 కాన్సెప్ట్ పోస్ట‌ర్ విడుద‌ల‌.. త్వ‌ర‌లోనే షూటింగ్‌

Versatile actor Thiruveer starrer Moonshine Pictures production no.1 concept poster release.. shooting soon

చ‌క్క‌టి హావ భావాలు, న‌ట‌న‌తో యాక్ట‌ర్‌గా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్న తిరువీర్.. ప‌రేషాన్‌, జార్జ్ రెడ్డి, ప‌లాస 1978, మ‌సూద వంటి వైవిధ్య‌మైన చిత్రాల్లో న‌టించి మెప్పించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాల్లో పెర్ఫామెన్స్ ప‌రంగా మెప్పించిన తిరువీర్ సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌శంస‌లు అందుకున్నారు. ప్ర‌స్తుతం మ‌ల్టీపుల్ ప్రాజెక్ట్స్‌తో తిరువీర్ బిజీగా ఉన్నారు. మ‌రిన్ని డిఫ‌రెంట్ ప్రాజెక్ట్స్ పైప్‌లైన్‌లో ఉన్నాయి. ఈ క్ర‌మంలో తిరువీర్ కొత్త సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. మూన్ షైన్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై సాయి మ‌హేష్ చందు, సాయి శ‌శాంక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజ్ విరాట్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. ద్రిష్టి త‌ల్వార్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రెండు వేర్వేరు ప్ర‌పంచాలు క‌ల‌యిక‌గా యూనిక్‌నెస్‌తో కాన్సెప్ట్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. డార్క్ కామెడీ జోన‌ర్‌లో ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా…