బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను మరియు ఉస్తాద్ రామ్ పోతినేని మోస్ట్ ఎవెయిటింగ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’ టైటిల్ గ్లిమ్ప్స్ సూపర్ రెస్పాన్స్ తో సోషల్ మీడియా లో దూసుకు వెళ్ళింది. ది ఎటాకర్ అనేది సినిమా ట్యాగ్‌లైన్ మరియు బోయపాటి శ్రీను,,రామ్ ని మునుపెన్నడూ చూడని మాస్ అవతార్ లో చూపించాడు. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి సింగిల్ “నీ చుట్టు చుట్టు” ప్రోమో ఆగస్టు 1వ తేదీన ఉదయం 10:26 గంటలకు విడుదల కానుంది. ఈ డ్యాన్స్ నంబర్ ఫుల్ లిరికల్ వీడియో ఆగస్టు 3న ఉదయం 9:26 గంటలకు విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. రామ్ మందపాటి గడ్డంతో మాస్ గా కనిపిస్తుండగా, శ్రీలీల మెరిసే వేషధారణలో గ్లామర్‌గా కనిపిస్తుంది. పోస్టర్ సూచించినట్లుగా…