ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రముఖ నటి సమంత నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మీ, షాలినీ కొండెపూడి, వంశీధర్ వంటి వారు ప్రధాన పాత్రలుగా పోషించిన ఈ చిత్రాన్ని ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించారు. ఈ మూవీ మే 9వ తేదీన విడుదలై సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతూ రెండో వారంలోకి అడుగు పెట్టేసింది. ఈ క్రమంలో శుక్రవారం నాడు చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో.. నటి, నిర్మాత సమంత మాట్లాడుతూ .. ‘పది శాతం సక్సెస్ రేట్ ఉన్న ఈ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చానా? అన్నది ఇప్పుడు నాకు అర్థం అవుతోంది. ‘శుభం’ మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరితో నవ్వులు, సంతోషం కనిపిస్తోంది. ఇదే అసలైన…
