శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని ముఖ్యతారలుగా తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటూ బ్లాక్‌బస్టర్ చిత్రంగా విజయపథంలో దూసుకెళుతోంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన బన్నీవాస్ మాట్లాడుతూ సినిమా కంటెంట్ బాగుంటే మీడియా తప్పకుండా ప్రోత్సహిస్తుందనే విషయాన్నీ ఈ చిత్రానికి వారు అందిస్తున్న సపోర్టుతో మరో సారి ప్రూవ్ అయింది. నాయట్టు అనే క్లాసిక్ చిత్రాన్ని తెలుగులో కమర్షియల్ హంగులతో చేస్తున్నప్పుడు మొదట్లో కాస్త భయపడ్డాను. కానీ ఈ రోజు మీడియా రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంగా వుంది.…