‘లియో’ సినిమాకు ముగ్గురు భామలు!

Three brothers-in-law for the movie 'Leo'!

తెలుగు, తమిళ భాషల్లో సూపర్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోయిన్లలో టాప్‌లో ఉంటుంది కీర్తిసురేశ్‌. ఈ భామతోపాటు రెండు భాషల్లో మంచి క్రేజ్‌ ఉన్న తారల్లో ముందువరుసలో ఉంటారు ఐశ్వర్యలక్ష్మి, కల్యాణి ప్రియదర్శన్‌. ఎప్పుడూ ప్రొఫెషనల్‌ కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉండే ఈ ముగ్గురు హీరోయిన్లు సరదాగా సినిమాకెళ్లారు. ఇంతకీ వీళ్లంతా ఏ సినిమా వెళ్లారనే కదా విూ డౌటు. కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ నటించిన లియో. ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. చెన్నైలోని వెట్రి థియేటర్‌లో ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోకు వెళ్లారు. ఈ సందర్భంగా థియేటర్‌లో సీట్లలో కూర్చొని సెల్ఫీ దిగారు. ఇప్పుడీ సెల్ఫీ నెట్టింట ట్రెండిరగ్‌ అవుతోంది. విజయ్‌ క్రేజ్‌కు ఫిదా అయ్యే వారిలో సెలబ్రిటీలు కూడా ఎక్కువే ఉంటారని.. తాజా సెల్ఫీతో మరోసారి రుజువు చేస్తున్నారు ముగ్గురు…