టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేకా, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘వృషభ’… ‘ది వారియర్ అరైజ్’ ట్యాగ్ లైన్. శనయ కపూర్, జహ్రా ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీఫిల్మ్స్, ఏవీఎస్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నంద కిషోర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా, శ్యామ్ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్ మథూర్, సౌరభ్ మిశ్రాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏకకాలంలో తెలుగు, మలయాళీ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీని హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయబోతోన్నారు. రోజు రోజుకీ ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ శుక్రవారం ముంబైలో…