సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ తొలిసారి కలసి చేస్తున్న ప్రాజెక్ట్ ‘జైలర్’తో ఫుల్ మీల్ ట్రీట్‌ను అందించబోతున్నారు.యాక్షన్ కామెడీ ఎంటర్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ టైటిల్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న జైలర్ సెకండ్ సింగిల్ ‘హుకుం’ పాటని మేకర్స్ ను విడుదల చేసారు. తెలుగు వెర్షన్ పాటను విక్టరీ వెంకటేష్ లాంచ్ చేశారు. ప్రేక్షకులని ప్రతిసారి అలరించే అనిరుధ్ ‘హుకుం ‘పాట కోసం థంపింగ్ ట్యూన్ చేశారు. బీట్‌లు వోకల్స్ హైలీ ఎనర్జిటిక్ గా వున్నాయి. ఈ పాటకు భాస్కరభట్ల చక్కని సాహిత్యం అందించారు. రజనీకాంత్ పూర్తి మాస్ అవతార్‌లో తుపాకులు పేల్చుతూ కనిపించారు. రజనీకాంత్ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, స్వాగ్, డైలాగ్ డెలివరీ…