`భీమ్లానాయక్` చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మోనిక రెడ్డి ప్రధాన పాత్రలో సుధా క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1 గా ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం ద్వారా రాకేష్ రెడ్డి యాస దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ భాస్కర్ రెడ్డి. ఈ రోజు పూజా కార్యక్రమాలతో చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన షేడ్స్ స్టూడియో ఫౌండర్ దేవి ప్రసాద్ భలివాడ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నిచ్చారు. మరో అతిథి అంజిరెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. SUDHA Creations Production No.1 movie opening అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దేవి ప్రసాద్ భలివాడ మాట్లాడుతూ…“ఒక మంచి కాన్సెప్ట్ తో యంగ్ టీమ్ అంతా కలిసి చేస్తోన్న ప్రాజెక్ట్ ఇది.…