ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, డా.తిమ్మప్ప నాయుడు పురిమెట్ల Ph.D నిర్మిస్తున్న సినిమా ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “పేపర్ బాయ్” చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ రోజు స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ‘అరి’ సినిమా నుంచి ‘భగ భగ..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘భగ భగ..’ లిరికల్ సాంగ్ చాలా బాగుందన్న నాగ్ అశ్విన్…మూవీ టీమ్ కు తన బెస్ట్ విశెస్ అందించారు. ఈ పాటను అనూప్ రూబెన్స్ ఫైర్ ఉన్న బీట్ తో కంపోజ్ చేయగా..వనమాలి పవర్ ఫుల్ లిరిక్స్…