శ్రీధర్ లగడపాటి సంచలనం!!

Sridhar Lagadapati Sensation!!

జి.వి.కె. సీనియర్స్ నేషనల్ టెన్నిస్ చాంపియన్షిప్ శ్రీధర్ సొంతం!! సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్న ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్… ఫిట్నెస్ కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. అంతే కాదు… సినిమా తర్వాత ఆయనకు గల మరో ముఖ్య ప్యాషన్ టెన్నిస్. రెగ్యులర్ టెన్నిస్ ప్లేయర్ అయిన శ్రీధర్… తాజాగా ఈ రంగంలోనూ తనదైన ముద్రను తిరుగులేనివిధంగా చాటుకున్నారు. ప్రతిష్టాత్మక జి.వి.కె. సీనియర్స్ నేషనల్ టెన్నిస్ చాంపియన్ గా నిలిచి చరిత్ర సృష్టించారు బహుముఖ ప్రతిభాశాలి లగడపాటి శ్రీధర్. 55 ప్లస్ కేటగిరీలో హోరాహోరీగా ఆత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ లో 12 -10 సూపర్ టై బ్రేకర్ గా ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని లగడపాటి నమోదు చేశారు. గత తొమ్మిదేళ్లుగా డిఫెండింగ్ చాంపియన్ గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి తో వైల్డ్ కార్డ్…