భారీ డీల్‌ కు ‘స్కంద’ సినిమా హక్కులు!

'Skanda' movie rights to a huge deal!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌ పోతినేని హీరోగా నటించిన సినిమా ’స్కంద’ సెప్టెంబర్‌ 15న విడుదలకి సిద్ధమవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది, అందులో బోయపాటి మార్కు అదే నరుక్కునే సన్నివేశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. శ్రీలీల కథానాయకి, థమన్‌ సంగీతం అందించాడు, ఈ సినిమాలో పాటలు వైరల్‌ అయ్యాయి కూడా. నందమూరి బాలకృష్ణ ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు వచ్చి సినిమా యూనిట్‌ కి విషెస్‌ చెప్పాడు. అలాగే ఇందులో సాయి మంజ్రేకర్‌ కూడా వుంది. ఇదిలా ఉండగా..ఈ సినిమా నిర్మాత చిట్టూరి శ్రీనివాస్‌ ఈ సినిమా సాటిలైట్‌, ఓటిటి చానెల్స్‌ తో మంచి డీల్‌ కుదుర్చుకున్నాడు అని పరిశ్రమలో టాక్‌ నడుస్తోంది. దక్షిణాదికి చెందిన నాలుగు భాషలు అంటే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల ఓటిటి, అలాగే సాటిలైట్‌ హక్కులు డిస్నీ ప్లస్‌…