అరవై తొమ్మిదవ జాతీయ పురస్కారాల్లో నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’కు అవార్డు రాలేకపోవడంపై ఫ్యాన్స్ సహా పలువురు నెటిజన్లు ట్వీట్స్ వేస్తున్నారు. అవార్డు గెలుచుకోవడానికి అన్ని అర్హతులున్నా ‘శ్యామ్‌సింగరాయ్’కు జాతీయ పురస్కారం వరించలేదు. దీనిపై ట్విట్టర్‌లో పెద్ద రచ్చ రచ్చజరుగుతోంది. ఇక నాని ‘జై భీమ్’ సినిమాకు అవార్డు రాకపోవడంపై హార్ట్ బ్రేక్ అయినట్లు ఓ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం అది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన’శ్యామ్ సింగరాయ్’ సినిమా ఏడాదినర్థం కిందట విడుదలై మంచి వసూళ్లు సాధించింది. ద్విపాత్రాభినయంలో నాని నటనకు పట్టం కట్టని ప్రేక్షకుడు లేడు. ముఖ్యంగా బెంగాళీ రచయిత శ్యామ్ సింగరాయ్ పాత్రలో నాని నటించాడు అనడం కంటే జీవించాడు అనడంలో అతిశయోక్తి లేదు. పునర్జన్మల కాన్సెప్ట్‌తో రాహుల్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. అంతే అద్భుతంగా…