మలయాళంలో షైన్ టామ్ చాకోకి మంచి క్రేజ్ ఉంది. చాలా సింపుల్‌గా కనిపిస్తూనే పవర్ ఫుల్ విలనిజం పండించడం ఆయన నైజం. అలాంటి ఆయన డిఫరెంట్ కంటెంట్‌తో కూడిన ‘వివేకానందన్ విరలను’ అనే సినిమా చేశారు. గత ఏడాది జనవరి 19న విడుదలైన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అలాంటి ఈ సినిమాను ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం అచ్చ తెలుగు ఓటీటీ ‘ఆహా’ స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అయింది. తన సబ్‌స్క్రైబర్ల కోసం ప్రతి శుక్రవారం కొత్త సినిమాలను అందించే ఆహా ఓటీటీ ఈ శుక్రవారం ‘వివేకానందన్ వైరల్’ పేరుతో సరికొత్త రొమాంటిక్ కామెడీ డ్రామాను అందించబోతోంది. ఈ సినిమాలో షైన్ టామ్ చాకో సరసన ఐదుగురు హీరోయిన్స్ కనిపిస్తారు. శ్వాసిక విజయ్, గ్రేస్ ఆంటోని, మెరీనా మైఖేల్, రమ్య సురేశ్,…