కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఃబ్రో డాడీః రీమేక్‌కు సంబంధించి రెండో హీరో విషయంలో కొన్ని రోజులుగా వార్తలు బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవికి కుమారుడిగా యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించబోతున్నట్లుగా మొదటి నుంచి వార్తలు వినపిస్తూనే ఉన్నాయి. కానీ, సిద్దు ఆ పాత్రలో చేయనని చెప్పడంతో.. ఆ ప్లేస్‌లో శర్వానంద్‌ని ఓకే చేసినట్లుగా తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ్ణభోళా శంకర్‌్ణ. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు కూడా యమ జోరుగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి రెండు సినిమాలకు ఓకే చెప్పినట్లుగా…