రాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మాణంలో రాకీ షెర్మన్ తెరకెక్కించిన చిత్రం ‘కర్మ స్థలం’. ఈ సినిమాలో అర్చన శాస్త్రి, మితాలి చౌహాన్, వినోద్ అల్వా, కలకేయ ప్రభాకర్, బాలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్, చిత్రం శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కర్మస్థలం అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్లో కనిపించిన పాత్రలు, ఆ పోస్టర్‌ను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకునేలా ఉంది. ఇక అర్చనా లుక్, గెటప్ ఈ పోస్టర్లో హైలెట్ అవుతోంది. బ్యాక్ గ్రౌండ్లో అమ్మవారి షాడో కనిపించడం చూస్తుంటే.. ఈ చిత్రానికి ఏ రేంజ్లో వీఎఫ్ఎక్స్ను వాడారో అర్థం చేసుకోవచ్చు. ఈ…