(చిత్రం: సంక్రాంతికి వస్తున్నాం, విడుదల : 14 జనవరి -2025, రేటింగ్ : 3.75/5, నటీనటులు: వెంకటేష్, మీనాక్షి చౌదరీ, ఐశ్వర్య రాజేశ్, వీకే నరేష్, వీటీ గణేష్, సాయి కుమార్, పమ్మి సాయి, సర్వదమన్ బెనర్జీ తదితరులు. దర్శకత్వం : అనిల్ రావిపూడి, నిర్మాత : దిల్ రాజు, సినిమాటోగ్రఫి: సమీర్ రెడ్డి, ఎడిటర్ : తమ్మిరాజు, మ్యూజిక్: భీమ్స్ సిసిరిలియో, బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్) దర్శకుడు అనీల్ రావిపూడి సినిమాలన్నీ విడుదలకి ముందే రిజల్ట్ లీక్ అయిపోతుంటాయి. అందులోనూ.. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ప్రతిసారి విక్టరీ కొట్టిన వెంకటేష్ తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటే హిట్ పక్కా అని విడుదలకు ముందే ఫిక్స్ అయిపోయారు ఫ్యామిలీ ఆడియన్స్. కథను టీజర్, ట్రైలర్‌లో చెప్పేస్తే అసలు కథపై ఇంట్రస్ట్ ఉండదని.. మెయిన్…