సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. నిర్మాతగా ఆయనది 40 ఏళ్ళ అనుభవం. స్ట్రెయిట్ తెలుగు, డబ్బింగ్ కలిపి 45కు పైగా సినిమాలు చేశారు. ‘ఆదిత్య 369’ వంటి గొప్ప సినిమాలు తీశారు. ఇప్పుడు సరోగసీ నేపథ్యంలో కొత్త కథతో ‘యశోద’ తీశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నవంబర్ 11న సినిమా విడుదలవుతోంది. ఈ సినిమాతో పాటు సమంత గురించి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మీడియాతో ముచ్చటించారు. ఆ విషయాలు మీ కోసం… సమంత నటించిన తొలి పాన్ ఇండియా సినిమా ‘యశోద’…