Salaar Review In Telugu: ‘సలార్’ మూవీ రివ్యూ : మోస్ట్ పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్!

Salaar Review In Telugu

By M.D ABDUL/Tollywoodtimes ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘సలార్’ కోసం అభిమానులేకాదు.. ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే.. అలాంటి ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య నేడు (22 డిసెంబర్-2023) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రభాస్ అభిమానులను ఎంతమేరకు మెప్పించింది? ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని కలిగించింది? విడుదలకు ముందే ఏర్పడ్డ భారీ అంచనాలను అందుకుందా.. లేదా? తెలుసుకుందాం… కథేంటో చూద్దాం : అసోంలోని ఓ ప్రాంతంలో ఉన్న బొగ్గు గనిలో పనిచేస్తుంటాడు దేవా అలియాస్ సలార్ (ప్రభాస్). ఆ ప్రాంతానికి ఆధ్య (శృతిహాసన్)అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకువస్తారు . దాంతో ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం ఏర్పడుతుంది. అక్కడినుంచి ఆమెను కొందరు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు వారి బారి నుంచి ఆమెను కాపాడుతాడు…